
హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో రైతు బంధు పంపిణీ మొదలయ్యింది. ఒక ఎకరం ఉన్న రైతులకు రైతు బంధు ఇవ్వడం ప్రారంభించారు. రాష్ట్రంలో మొదటి రోజు 18 లక్షల మంది రైతుల అకౌంట్లలో రైతుబంధు నిధులు జమయ్యాయి. 18,12,656 మంది ఖాతాల్లో రూ.545.55 కోట్లు డిపాజిట్ చేసినట్టు మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి, రైతులకు సర్కారు అండగా నిలుస్తోందని, రైతులందరికీ పెట్టు బడి సాయం అందుతుందని ఆయన తెలిపారు.