రొమ్ము క్యాన్సర్ మందుల ధరలు తగ్గించలేం... కేరళ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై నోవార్టిస్‌‌, ఎలీ లిల్లీ

రొమ్ము క్యాన్సర్ మందుల ధరలు తగ్గించలేం... కేరళ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై నోవార్టిస్‌‌, ఎలీ లిల్లీ

న్యూఢిల్లీ: రొమ్ము క్యాన్సర్ చికిత్సలో వాడే అత్యంత ఖరీదైన మందుల ధరలను సామాన్యులకు అందుబాటులోకి తెచ్చేలా ప్రభుత్వం జోక్యం చేసుకోవాలంటూ కేరళ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. దీనిని అంతర్జాతీయ ఫార్మా దిగ్గజాలు నోవార్టిస్ , ఎలీ లిల్లీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. 

రీసెర్చ్‌‌కు  భారీగా ఖర్చు చేశామని కంపెనీలు చెబుతున్నాయి.  దాదాపు రూ.6,400 కోట్ల రీసెర్చ్ కోసం ఖర్చు చేయగా, 2020–2025 మధ్య ఈ రెండు కంపెనీలు రూ.1.88 లక్షల కోట్ల వరకు ఆదాయం పొందాయి. కాగా, యేల్ యూనివర్సిటీ నిపుణుల లెక్కల ప్రకారం, ఒక రోగికి నెలకు సరిపడే రిబోసిక్లిబ్ మాత్రల వాస్తవ తయారీ ఖర్చు కేవలం రూ.5,100 నుంచి రూ.7,750 మాత్రమే. 

కానీ నోవార్టిస్ భారత్‌‌లో దీనికి నెలకు ఏకంగా రూ.78,400 వరకు అవుతున్నాయి. అంటే కంపెనీలు తయారీ ఖర్చు కంటే 10 నుంచి 15 రెట్లు ఎక్కువ తీసుకుంటున్నాయి.