పది రూపాయలకే దమ్ బిర్యానీ ఇస్తామంటూ ఓ హోటల్ యజమాని ప్రకటించాడు..ఇంకేముంది వెంటనే జనం పది రూపాయలతో బిర్యానీ కోసం హోటల్ పై ఎగబడ్డారు. ఖమ్మం నగరంలోని ముస్తఫా నగర్ ప్రాంతంలో నూతనంగా బిర్యానీ పాయింట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హోటల్ యజమాని పబ్లిసిటీ కోసం పది రూపాయలకే బిర్యానీ అంటూ ప్రకటించాడు.
అయితే పది రూపాయల కాయిన్లతో ముందుగా వచ్చిన 500 మందికి బిర్యానీ ఇస్తామంటూ ప్రచారం చేశాడు. దీంతో పది రూపాయల కాయిన్లతో జనం భారీగా తరలి వచ్చారు. దీంతో హోటల్ వద్ద తొక్కిసలాట జరగింది.. అంతేకాదు బిర్యానీ కోసం ఒకరిపై మరొకరు పోటి పడుతూ తన్నుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని జనానికి సర్దిచెప్పి పంపించారు. అనంతరం హోటల్ యజమానిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
