ఊర్లో లిక్కర్ ​అమ్మితే రూ.10 వేలు జరిమానా

ఊర్లో లిక్కర్ ​అమ్మితే రూ.10 వేలు జరిమానా

మెదక్ (నార్సింగి), వెలుగు: ఊరిలో ఎవరైనా లిక్కర్​అమ్మినా, కొనుక్కొని తాగినా జరిమానా కట్టాలని మెదక్ జిల్లా నార్సింగి మండలం శేరిపల్లి గ్రామ పంచాయతీ తీర్మానించింది. గ్రామంలో సంపూర్ణ మద్య నిషేధం విధించాలని డిమాండ్​చేస్తూ సోమవారం మహిళలంతా ఒక్కటై ర్యాలీ నిర్వహించారు. ఇల్లీగల్​గా నడుస్తున్న ఐదారు బెల్ట్​షాపులను క్లోజ్​చేయించాలని కోరారు. మద్యానికి బానిసలై చాలా మంది ఆర్థికంగా, ఆరోగ్య పరంగా నష్టపోతున్నారని వాపోయారు. స్పందించిన సర్పంచ్​చెప్యాల మల్లేశం.. ఊర్లో ఎవరైనా బెల్ట్ షాపులు నడిపితే రూ.10 వేలు, అందులో కొనుక్కొని తాగితే రూ.5వేలు జరిమానా విధిస్తామని స్పష్టం చేశారు. లిక్కర్​అమ్ముతున్నట్లు సమాచారం ఇస్తే రూ.2 వేలు నజరానా అందిస్తామని వెల్లడించారు. ర్యాలీలో వార్డు సభ్యులు నర్సింహులుగౌడ్, సత్యం, సుశీల, మహిళా సంఘాల అధ్యక్షులు తాళ్ల స్వప్న, గజవెల్లి స్వప్న, లత, వీఏఓ రామచంద్రం యాదవ్, మల్లీశ్వరి పాల్గొన్నారు.