హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో మందుబాబుల వీరంగం.. డ్రైవర్పై దాడి

హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో మందుబాబుల వీరంగం.. డ్రైవర్పై దాడి

ఆర్టీసీ డ్రైవర్లపై దాడులకు సంబంధించిన ఘటనలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. మొన్న హకీంపేటలో బస్సు డ్రైవర్ పై దాడి ఘటన మరువక ముందే వరంగల్ జిల్లాలో మరో దాడి జరిగింది. హైదరాబాద్ నుంచి మహబూబాబాద్ వెళ్తున్న ఆర్టీసీ  బస్సులో మద్యం మత్తులో ముగ్గురు వ్యక్తులు హల్ చల్ చేశారు.

నర్సంపేట దగ్గర బస్సెక్కిన మందు బాబులు డ్రైవర్ తో గొడవకు దిగారు. గేర్ బాక్స్ పైన కూర్చొని బూతు పురాణం మొదలు పెట్టారు. నర్సంపేట ఎమ్మెల్యే తమ బంధువని చెప్పి.. మద్యం మత్తులో ఆర్టీసీ డ్రైవర్ పై దాడి చేశారు. అడ్డుకోబోయిన కండక్టర్ పై కూడా దాడికి దిగారు. 

దీంతో డ్రైవర్ బస్సు ను నేరుగా పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లాడు. మందుబాబుల దాడికి సంబంధించి పోలీసుకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.