ఈ రోజు నుంచి బస్సు ఎక్కే వారికి గుడ్ న్యూస్

ఈ రోజు నుంచి బస్సు ఎక్కే వారికి గుడ్ న్యూస్

హైదరాబాద్, వెలుగు : బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో  ఆర్టీసీ బుధవారం నుంచి లక్కీ డ్రా పెట్టాలని నిర్ణయించింది. బస్సుల్లో ప్రయాణం పూర్తయిన ప్యాసింజర్లు తమ టికెట్ వెనకాల పేరు, ఫోన్ నంబర్ రాసి.. వాటిని బస్టాండ్లలో ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్సుల్లో వేయాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కోరారు. 

ఈ ప్రక్రియ స్టేట్​మొత్తం 30 వరకు కొనసాగుతుందన్నారు. ప్రతి రీజియన్ కేంద్రంలో లక్కీ డ్రా నిర్వహించి 10  మంది చొప్పున విజేతలను ఎంపిక చేస్తామన్నారు. మొత్తం 110 మందికి  ఒక్కొకరికి రూ.9,900 చొప్పున మొత్తం రూ.11 లక్షల నగదు బ‌‌హుమ‌‌తులను అందిస్తామన్నారు.