ఆర్టీఐ ద్వారా పౌరులు కోరిన సమాచారం ఇవ్వాల్సిందే : చీఫ్ కమి షనర్ చంద్రశేఖర్ రెడ్డి

ఆర్టీఐ ద్వారా  పౌరులు కోరిన సమాచారం ఇవ్వాల్సిందే : చీఫ్ కమి షనర్ చంద్రశేఖర్ రెడ్డి
  • చీఫ్ కమిషనర్​ చంద్రశేఖర్​ రెడ్డి

నిజామాబాద్​, వెలుగు: ప్రభుత్వ యంత్రాంగం విధుల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించి ప్రజల్లో విశ్వాసాన్ని పెంచడమే సమాచార హక్కు చట్టం ఉద్దేశ్యమని రాష్ట్ర ఆర్టీఐ చీఫ్ కమిషనర్ డాక్టర్ జి. చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌‌లో జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో దాపరికాలకు తావులేదని, ప్రజలు కోరిన సమాచారాన్ని ఇవ్వాల్సిందేనన్నారు. పాలకులను ప్రశ్నించే హక్కును ఈ చట్టం పౌరులకు కల్పించిందని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులందరూ ప్రజాసేవకులేనని గుర్తుంచుకుని అడిగిన సమాచారాన్ని ఆలస్యం చేయకుండా ఇవ్వాలని సూచించారు. 

రాష్ట్రంలో ఇప్పటివరకు లక్ష మందికి సమాచారం అందించామని, 15 వేల అప్పీలు కమిషన్‌‌కు వచ్చాయని చెప్పారు. ఆర్టీఐ సమర్థవంతంగా అమలవుతున్న దేశాల్లో భారత్ నాలుగో స్థానంలో ఉందని కమిషనర్ దేశాల భూపాల్ తెలిపారు. ఆర్టీఐ దరఖాస్తులు వచ్చినప్పుడు అధికారులు భయపడాల్సిన అవసరం లేదని కమిషనర్ పీవీ శ్రీనివాస్ రావు అన్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి, సీపీ సాయిచైతన్య తదితరులు పాల్గొన్నారు.