రష్యా కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్ పై అనేక సందేహాలు..? అనుమానాలు తలెత్తుతున్న తరుణంలో ఆ వ్యాక్సిన్ ఫ్రీ – క్లినికల్ ట్రయల్స్ కు సంబంధించిన సమాచారం త్వరలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది.
రష్యా కరోనా వ్యాక్సిన్ ను తయారు చేసింది. స్పుత్నిక్ పేరుతో విడుదల చేసింది. కానీ ఆ వ్యాక్సిన్ హ్యూమన్ ట్రయల్స్ చేసిందా..? చేస్తే ఎన్నిసార్లు చేసింది..? ట్రయల్స్ పాల్గొన్న వాలంటీర్ల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనే విషయాల్ని బహిర్ఘతం చేయాల్సి ఉంది.
కానీ రష్యా వ్యాక్సిన్ గురించి చెప్పేందుకు ఇష్టపడలేదు. దీంతో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రష్యా కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్ పై పలు ఆదేశాలు జారీ చేసింది.
క్లీనికల్ ట్రయల్స్ పూర్తికాకుండా వ్యాక్సిన్ ను ఎలా విడుదల చేస్తారని ప్రశ్నిస్తూ…హ్యూమన్ ట్రయల్స్ గురించి పూర్తి డేటా తమకు అందించాలని సూచించింది. దీంతో అప్రమత్తమైన రష్యా ప్రభుత్వం వ్యాక్సిన్ ఫ్రీ ట్రయల్స్ డేటాను అందించేందుకు సిద్ధమైంది. ఆగస్ట్ 17న పూర్తి డేటా అందిస్తామని ఆరోగ్య మంత్రి మిఖాయిల్ మురాష్కో తెలిపారు. తమదేశం విడుదల చేసిన వ్యాక్సిన్ పై వస్తున్న రూమర్లు అవాస్తవాలేనని మురాష్కో ఖండించారు.
మరోవైపు మిలియన్ల సంఖ్యలో కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్ ను రష్యా ప్రభుత్వం తయారు చేస్తుంది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ గురించి పూర్తి సమాచారం సేకరిస్తున్నామని, రష్యా ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు డబ్ల్యూహెచ్‌ఓ ప్రతినిధి తెలిపారు.
ఆ తొమ్మిదింట్లో రష్యా వ్యాక్సిన్ లేదు
ప్రపంచ వ్యాప్తంగా 9 సంస్థలు కరోనా వ్యాక్సిన్ ను తయారు చేస్తున్నట్లు తమ నివేదికలో ఉన్నట్లు డబ్ల్యూహెచ్ ఓ డైరెక్టర్ జనరల్ సీనియర్ సలహాదారు డాక్టర్ బ్రూస్ ఐల్వర్డ్ తెలిపారు. 9 సంస్థలు రెండు, మూడు హ్యూమన్ ట్రయల్స్ దశలు ఉన్నాయని, ఆ సంస్థల్లో రష్యా లేదని ప్రకటించారు
