
రష్యా దాడులతో ఉక్రెయిన్ చిగురుటాకులా వణికిపోతోంది. భీకర బాంబు దాడులతో ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. చిన్న పిల్లలను వెంటబెట్టుకుని దేశం విడిచి వెళ్లిపోతున్నారు. మరోవైపు రష్యా సైనికులకు ధీటుగా ప్రాణాలను లెక్కచేయకుండా వీరోచితంగా పోరాడుతున్నారు ఉక్రెయిన్ బలగాలు. ఈ క్రమంలో రష్యా జనావాసాలనే లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులు చేస్తుందని యూకే ఇంటెలిజెన్స్ తెలిపింది. రష్యాను ఆశ్చర్యపరిచేలా ఉక్రెయిన్ సేనలు కూడా ప్రతిఘటిస్తున్నాయని పేర్కొంది. రష్యా సేనలు ఖార్కివ్, చెర్నిహివ్, మారియూపోల్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తుందని బ్రిటీష్ ఇంటెలిజెన్స్ తెలిపింది.
మరిన్ని వార్తల కోసం