రష్యా వ్యాక్సిన్ .. మనకు ఇప్పట్లో కష్టమే

రష్యా వ్యాక్సిన్ .. మనకు ఇప్పట్లో కష్టమే

స్పుత్నిక్ V రావాలంటే చాలా టైమ్ పట్టే అవకాశం

రష్యా వ్యాక్సిన్ మనదేశానికి రావడానికి  చాలా టైమ్ పట్టే అవకాశాలు కన్పిస్తున్నాయి. వ్యాక్సిన్ ప్రొడక్షన్, దానికి సంబంధించిన ఒప్పందాలు, మన దేశంలోని రెగ్యులేటరీ అనుమతులు మన దేశానికి వ్యాక్సిన్ రావడంపై ప్రభావం చూపించనున్నాయి. ఇక వ్యాక్సిన్ సామర్థ్యంపై మన దేశంతోపాటు అనేక దేశాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.

న్యూఢిల్లీ: ఫేజ్ 3 ట్రయల్స్ లేవు. ఫేజ్ 1, ఫేజ్ 2 ట్రయల్స్ ఫలితాలూ చెప్పలేదు. అయినా సరే, కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్ Vను రిలీజ్ చేసేసింది రష్యా. చాలా దేశాలు ఆ వ్యాక్సిన్ పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఆ జాబితాలో మన దేశమూ ఉంది. మరి, రష్యా వ్యాక్సిన్ మనదేశానికి వస్తుందా? మనోళ్లకు అందుతుందా? అన్న ప్రశ్నలకు ఇప్పట్లో కష్టమే అన్న సమాధానాలు వస్తున్నాయి. వ్యాక్సిన్ ప్రొడక్షన్ , దానికి సంబంధించిన ఒప్పందాలు, మన దేశంలోని రెగ్యులేటరీ అనుమతులు మన దేశానికి వ్యాక్సిన్ రావడంపై ప్రభావం చూపించనున్నాయి. వీటన్నింటినీ లెక్కలోకి తీసుకున్నా మనకు ఆ వ్యాక్సిన్ అందేందుకు చాలా టైం పడుతుందని నిపుణులు భావిస్తున్నారు.

ప్రొడక్షన్ తక్కువే

రష్యా వ్యాక్సిన్ అయితే రిలీజ్ చేసింది కానీ.. వాటి ప్రొడక్షనే ఇప్పుడు కీలకం కానుంది. వ్యాక్సిన్ ను తయారు చేసిన గమాలియా రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (జీఆర్ ఐ)తో పాటు రష్యాలో అతిపెద్ద కంపెనీల్లో ఒకటైన సిస్టమా ప్లాంట్ లో వ్యాక్సిన్ ను తయారు చేయనున్నారు. ఆ ప్లాంట్ కు ఏటా కేవలం 15 లక్షల డోసులను తయారు చేసే కెపాసిటీనే ఉంది. అయితే, ప్రొడక్షన్ కెపాసిటీని పెంచుతామని కంపెనీ చెబుతోంది. ఇప్పటికే ఫస్ట్ బ్యాచ్ వ్యాక్సిన్లు రెడీ అయ్యాయని, మొదటగా డాకర్లు్ట , టీచర్లకు వ్యాక్సిన్ ను ఇచ్చేందుకు సరఫరా చేస్తామని సిస్టమా ప్రకటించింది. ఎన్ని డోసులు తయారు చేసింది మాత్రం చెప్పలేదు. మరోవైపు వంద కోట్ల డోసులు కావాలని ప్రపంచ దేశాల నుంచి ఆర్డర్స్ వచ్చినట్టు రష్యా చెబుతోంది. అందులో సగం డోసులు అంటే ఏటా 50 కోట్ల డోసులను ఇచ్చేందుకు వివిధ దేశాలతో ఒప్పందం చేసుకున్నట్టు చెప్పింది. అది కూడా ఆయా దేశాల్లోనే ప్రొడక్షన్ చేసేలా ఒప్పందం చేసుకున్నట్టు వివరించింది. కానీ, ఆ దేశాల పేర్లను బయటపెట్టలేదు. వ్యాక్సిన్ పై మన దేశం ఆసక్తి చూపిస్తున్నదని రష్యా చెబుతున్నా . ప్రస్తుతానికి ఎలాంటి ఒప్పందం చేసుకోలేదు. కాబట్టి ఇప్పుడే రష్యా వ్యాక్సిన్ పై హోప్స్ పెట్టుకోవడానికి లేదంటున్నారు నిపుణులు.

లేట్ ఫేజ్ ట్రయల్స్చేయాల్సిందే!

మన దేశంలో రష్యా వ్యాక్సిన్ అందుబాటులోకి రావాలంటే ఫస్ట్ దాటాల్సింది రెగ్యులేటరీ అనుమతులు. అందుకు వ్యాక్సిన్లు, మందులకు రెగ్యులేటరీ అప్రూవల్స్ ఇచ్చే సెం ట్రల్ డ్రగ్స్స స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్ సీవో).. వ్యాక్సిన్ పై లేట్ ఫేజ్ హ్యూమన్ ట్రయల్స్ చేయాల్సిందిగా రష్యాను అడగాలి. అంటే మన దేశ ప్రజలపై ఫేజ్ 2, ఫేజ్ 3 ట్రయల్స్ చేయాల్సి ఉంటుంది. మామూలుగా మన దేశం బయట తయారైన ఏ వ్యాక్సిన్ కైనా, మందులకైనా ఇదే పద్ధతిని ఫాలో అవుతుంటారు. దానికీ ఓ కారణముంది. వివిధ దేశాల్లోని ప్రజలకు సంబంధించి వ్యాక్సిన్ ఎఫికసీ (సామర్థ్యం)లో తేడాలుంటాయి. కాబట్టి మన దేశ ప్రజలపై ఆ వ్యాక్సిన్ ఎలాంటి ఫలితాలనిస్తుందో తెలుసుకునేందుకు ఇలా లేట్ ఫేజ్ హ్యూమన్ ట్రయల్స్ చేయిస్తారు. ప్రస్తుతం ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ తయారు చేసిన చేడాక్స్ 2 ఎన్ కోవ్ 19 వ్యాక్సిన్ ట్రయల్స్ ఈ పద్ధతిలోనే నడుస్తున్నాయి. వ్యాక్సిన్ ను తయారు చేసేందుకు ఒప్పందం చేసుకున్న సీరమ్ ఇనిస్ట్యూ ట్ ఆఫ్ ఇండియా అనుమతులు తీసుకుని ఫేజ్ 3 ట్రయల్స్ చేస్తోంది. ఇప్పుడు రష్యా వ్యాక్సిన్ రావాలన్నా ఇదే పద్ధతిని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అందుకు ముందుగా ఏ కంపెనీతోనైనా లేదంటే ప్రభుత్వం తోనైనా రష్యా ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. ఒప్పందాలైన తర్వాత ట్రయల్స్ కు అనుమతి తీసుకోవాలి. వాటికి అనుమతి లభిస్తే.. ఆ ట్రయల్స్ పూర్తి కావడానికి  2 నుంచి 3 నెలల టైం పడుతుంది. ఆ తర్వాత దాని ఫలితాలను రిలీజ్ చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన స్పుత్నిక్ V మన దేశానికి రావాలంటే కనీసం ఆరునెలల నుంచి ఏడాది దాకా పట్టే అవకాశాలున్నాయి.

ఎమర్జెన్సీ యూజ్ కూడా డౌటే

ట్రయల్స్ వద్దనుకుంటే ప్రస్తుతమున్న పరిస్థితు ల దృష్ట్యా ‘ఎమర్జెన్సీ యూజ్ ’ కోసం సీ డీఎస్ సీవో వ్యాక్సి న్ కు ఓకే చెప్పొచ్చు. అలా చెప్పే అధికారం సీడీఎస్ సీవోకు ఉంది. రష్యాలో హ్యూమన్ ట్రయల్స్ కు సంబంధించి వ్యాక్సిన్ సేఫ్టీ, ఎఫికసీ (సామర్థ్యం)పై నమ్మకం ఉందను కుంటే మన దేశంలో లేట్ ఫేజ్ హ్యూమన్ ట్రయల్స్ లేకుండానే ఎమర్జెన్సీ యూజ్ కు సంస్థ ఓకే చెప్పొచ్చు. అమెరికాకు చెందిన గి లీడ్ సంస్థ ‘రెమ్డెసి విర్’ డ్రగ్ కు ఇలాగే ట్రయల్స్ లేకుండానే ఎమర్జెన్సీ వాడకానికి అనుమతులిచ్చింది. కానీ వ్యాక్సిన్ విషయంలో ఇలా అనుమతులు ఇచ్చేందుకు అవకాశాలు తక్కువేనంటున్నారు నిపుణులు. మందు పేషెంట్ కే ఇస్తారని, వ్యాక్సిన్ ను పెద్ద సంఖ్యలో జనానికి ఇవ్వాల్సి ఉంటుందని చెబుతున్నారు. మామూలుగా వ్యాక్సిన్లను చిన్న వయసులోనే ఇస్తుంటారు. పెద్ద వాళ్లకు ఇవ్వడం చాలా అరుదు. ఇలాంటి మహమ్మారులు వచ్చినప్పుడే అందరికీ వ్యాక్సిన్ వేస్తారు. కాబట్టి ఫేజ్ 3 ట్రయల్స్ పూర్తి కాని రష్యా వ్యాక్సిన్ ను.. మన దేశంలో ట్రయల్స్ లేకుండా వేయడమంటే సేఫ్టీని గాలి కొదిలేయడమేనని నిపుణులు చెబుతున్నారు. కొంచెం తేడా వచ్చినా నష్టం భారీగా ఉంటుందని, కాబట్టి ఎమర్జెన్సీ యూజ్ వద్దేవద్దని అంటున్నారు.