ఉక్రెయిన్ రాజధానిని ఆక్రమించిన రష్యా 

ఉక్రెయిన్ రాజధానిని ఆక్రమించిన రష్యా 

ఉక్రెయిన్ రాజధాని కీవ్ను రష్యా బలగాలు పూర్తిస్థాయిలో ఆక్రమించుకున్నాయి. కీవ్ను రష్యా బలగాలు స్వాధీనం చేసుకున్నట్లు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ చెప్పారు. ప్లాన్  ప్రకారం బెలారస్ రూట్ నుంచి చెర్నోబిల్ మీదుగా రష్యా బలగాలు వ్యూహాత్మకంగా కీవ్ను చేరుకున్నాయి. రష్యా ఆర్మీని నిలువరించేందుకు ఉక్రెయిన్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. బలగాలు బంకర్లతో రాకుండా బ్రిడ్జిలు పేల్చేసినా.. దారులన్నీ మూసేసే ప్రయత్నం చేసినా రష్యా సైన్యం దూసుకొచ్చింది. ఈ క్రమంలో రష్యన్ ఆర్మీకి, ఉక్రెయిన్ సైన్యానికి మధ్య పెద్ద ఎత్తున కాల్పుల జరిగాయి. ఈ క్రమంలో ఇరువైపులా తీవ్ర ప్రాణనష్టం జరింగింది. 

మరోవైపు ఉక్రెయిన్ పై రెండో రోజు రష్యా దాడులు కంటిన్యూ అవుతున్నాయి. బ్లాక్ సీలోని ఉక్రెయిన్కు చెందిన స్నేక్ ఐలాండ్ను రష్యా దళాలు ఆక్రమించుకున్నాయి. హెచ్చరికలకు లొంగని 13 మంది ఉక్రెయన్ బోర్డర్ సైనికులను హతమార్చారు. కీవ్, ఖార్కీవ్, ఒడెసా, ద్నిప్రో ప్రాంతాల్లో వరుసగా దాడులు కొనసాగిస్తోంది. సైనిక స్థావరాలే లక్ష్యంగా 13 నగరాల్లో బాంబుల వర్షం కురిపిస్తోంది. చెర్నోబిల్ న్యూక్లియర్ రియాక్టర్ కేంద్రాన్ని సైతం రష్యన్ ఆర్మీ స్వాధీనం చేసుకుంది. 

మరిన్ని వార్తల కోసం..

కీవ్పై రష్యా బలగాల బాంబుల వర్షం

ఉక్రెయిన్‎లో ఓ తండ్రి వ్యథ.. కన్నీళ్లు పెట్టించే వీడియో..