ఫ్రెంచ్‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌‌‌‌‌‌‌‌: సబలెంక సాఫీగా.. స్వైటెక్‌‌‌‌‌‌‌‌, రిబకినా, రూనె కూడా..

ఫ్రెంచ్‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌‌‌‌‌‌‌‌: సబలెంక సాఫీగా.. స్వైటెక్‌‌‌‌‌‌‌‌, రిబకినా, రూనె కూడా..

పారిస్‌‌‌‌‌‌‌‌: వరల్డ్‌‌‌‌‌‌‌‌ నంబర్‌‌‌‌‌‌‌‌వన్‌‌‌‌‌‌‌‌, బెలారస్‌‌‌‌‌‌‌‌ స్టార్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌ అరీనా సబలెంక.. ఫ్రెంచ్‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌‌‌‌‌‌‌‌లో నాలుగో రౌండ్‌‌‌‌‌‌‌‌లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన విమెన్స్‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌ మూడో రౌండ్‌‌‌‌‌‌‌‌లో టాప్‌‌‌‌‌‌‌‌సీడ్‌‌‌‌‌‌‌‌ సబలెంక 6–2, 6–3తో ఓల్గా డానిలోవిచ్‌‌‌‌‌‌‌‌ (సెర్బియా)పై నెగ్గింది. గంటా 19 నిమిషాల మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో పూర్తి ఆధిపత్యం చూపెట్టిన సబలెంక తొలి గేమ్‌‌‌‌‌‌‌‌లో వరుసగా ఐదు గేమ్‌‌‌‌‌‌‌‌లు గెలిచి జోరు చూపెట్టింది. మ్యాచ్ మొత్తంలో ఒకే ఒక్క ఏస్‌‌‌‌‌‌‌‌ కొట్టిన బెలారస్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌ 9 బ్రేక్‌‌‌‌‌‌‌‌ పాయింట్లలో ఐదింటిని కాచుకుంది. తన సర్వీస్‌‌‌‌‌‌‌‌లో 63 శాతం పాయింట్లు రాబట్టిన సబలెంక.. ప్రత్యర్థి సర్వ్‌‌‌‌‌‌‌‌లకు ఈజీగా చెక్‌‌‌‌‌‌‌‌ పెట్టింది.

ఇతర మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో ఐదోసీడ్‌‌‌‌‌‌‌‌ ఇగా స్వైటెక్‌‌‌‌‌‌‌‌ (పోలెండ్‌‌‌‌‌‌‌‌) 6–2, 7–5తో జాక్వెలిన్‌‌‌‌‌‌‌‌ అడిన్‌‌‌‌‌‌‌‌ క్రిస్టిన్‌‌‌‌‌‌‌‌ (రొమేనియ)పై, జాంగ్‌‌‌‌‌‌‌‌ (చైనా) 6–3, 6–4తో విక్టోరియా బోకో (కెనడా)పై, పౌలిని (ఇటలీ) 6–4, 6–1తో యులియా స్టారోడబ్సేవా (ఉక్రెయిన్‌‌‌‌‌‌‌‌)పై, రిబకినా (కజకిస్తాన్‌‌‌‌‌‌‌‌) 6-–2, 6–-2తో ఒస్టాపెంకో (లాత్వియా)పై, అన్సిమోవా (అమెరికా) 7-–6 (7/4), 6–-4తో టౌసన్‌‌‌‌‌‌‌‌ (డెన్మార్క్‌‌‌‌‌‌‌‌)పై, సమ్సనోవా (రష్యా) 6-–2, 6–-3తో యాస్ట్రమేస్కా (ఉక్రెయిన్‌‌‌‌‌‌‌‌)పై గెలిచి నాలుగో రౌండ్‌‌‌‌‌‌‌‌లోకి అడుగుపెట్టారు. మెన్స్‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌లో ముసెట్టీ (ఇటలీ) 4–6, 6–4, 6–3, 6–2తో మరియనా నవోని (అర్జెంటీనా)పై, రూనె (నార్వే) 4–6, 6–2, 5–7, 7–5, 6–2తో క్వింటెన్‌‌‌‌‌‌‌‌ హైల్స్‌‌‌‌‌‌‌‌ (ఫ్రాన్స్‌‌‌‌‌‌‌‌)పై, టొమి పాల్‌‌‌‌‌‌‌‌ (అమెరికా) 6–3, 3–6, 7–6 (9/7), 3–6, 6–3తో కచనోవ్‌‌‌‌‌‌‌‌ (రష్యా)పై నెగ్గి ముందంజ వేశారు.

మూడో రౌండ్‌‌‌‌‌‌‌‌లో యూకీ జోడీ
ఇండియా స్టార్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌ యూకీ భాంబ్రీ–రాబర్ట్‌‌‌‌‌‌‌‌ గాల్లోవే (అమెరికా) మూడో రౌండ్‌‌‌‌‌‌‌‌లోకి అడుగుపెట్టారు. మెన్స్‌‌‌‌‌‌‌‌ డబుల్స్‌‌‌‌‌‌‌‌ రెండో రౌండ్‌‌‌‌‌‌‌‌లో యూకీ–గాల్లోవే 6–7 (4), 7–6 (7), 6–3తో ఏడోసీడ్‌‌‌‌‌‌‌‌ నికోల మెక్టిక్‌‌‌‌‌‌‌‌ (క్రొయేషియా)–మైకేల్‌‌‌‌‌‌‌‌ వీనస్‌‌‌‌‌‌‌‌ (న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌)పై సంచలన విజయం సాధించారు. రెండు గంటల 32 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో యూకీ ద్వయం 10 ఏస్‌‌‌‌‌‌‌‌లు, 6 డబుల్‌‌‌‌‌‌‌‌ ఫాల్ట్స్‌‌‌‌‌‌‌‌ చేసింది. తమ సర్వీస్‌‌‌‌‌‌‌‌లో 80 శాతం పాయింట్లు నెగ్గిన ఇండో–యూఎస్‌‌‌‌‌‌‌‌ జోడీ 12 బ్రేక్‌‌‌‌‌‌‌‌ పాయింట్లలో మూడింటిని కాచుకున్నారు.