
శబరిమల అయ్యప్ప ఆలయంలో ద్వార పాలకవిగ్రహాలనుంచి బంగారం చోరీ కేసు కీలక మలుపు తిరిగింది. శుక్రవారం (అక్టోబర్17) తెల్లవారు జామున ఈ కేసులో ప్రధాని నిందితుడు ఉన్ని కృష్ణన్ పొట్టిని పోలీసులు అరెస్ట్ చేశారు. దేవస్వం మంత్రి విఎన్ వాసవన్ ,ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు (టిడిబి) అధ్యక్షుడు పిఎస్ ప్రశాంత్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు తీవ్రమవుతున్న ఆందోళనల క్రమంలో ఉన్నికృష్ణన్ ను అరెస్టు చేశారు సిట్ అధికారులు.
గురువారం విచారణకోసం ఉన్నికృష్ణన్ పొట్టిని క్రైమ్ బ్రాంచ్ఆఫీసుకు పిలించింది SIT. రహస్య ప్రదేశంలో విచారించింది.. అనంతరం శుక్రవారం తెల్లవారు జామున అరెస్టు చేసింది. అరెస్టుకు ముందు వైద్య పరీక్షలకోసం తిరువనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించింది.
2019 లో శబరిమల ఆలయ పూజారికి సహాయకుడిగా పనిచేసిన ఉన్నికృష్ణ న్ పొట్టి.. ఆలయానికి విరాళంగా ఇచ్చిన రెండు రాగి బంగారు పూతలు కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. శబరిమల అయ్యప్ప ఆలయంలో బంగారం చోరీ కేసును సుమోటాగా స్వీకరించిన కేరళ హైకోర్టు.. దర్యాప్తు చేపట్టాలని సిట్ కు అప్పగించింది..ట్రావెన్ కోర్ దేవస్యం బోర్టు (TDB) మాజీ అధికారులు ఉన్నికృష్ణన్ పొట్టిని అరెస్ట్ చేసి దర్యాప్తును వేగవంతం చేసింది.