వైరలవుతున్న సేఫ్ హ్యాండ్స్ చాలెంజ్.. ఫాలోవుతున్న సెలబ్రెటీలు

వైరలవుతున్న సేఫ్ హ్యాండ్స్ చాలెంజ్.. ఫాలోవుతున్న సెలబ్రెటీలు

కరోనా కట్టడికి డబ్ల్యూహెచ్‌ఓ సేఫ్ హ్యాండ్స్ చాలెంజ్

కరోనా కట్టడికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్ఓ) ఓ వినూత్న ఆలోచనతో ముందుకొచ్చింది. ఐస్ బకెట్, ఫిట్ నెస్, గ్రీన్ ఇండియా తదితర చాలెంజెస్ లాగానే సేఫ్ హ్యాండ్స్ చాలెంజ్‌ను ప్రారంభించింది. కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ఎప్పటికప్పుడు చేతులు కడుక్కోవాలని సూచిస్తూ డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయెసస్ ఈ చాలెంజ్‌ను స్టార్ట్ చేశారు. ఆయన పోయిన వారం ట్విట్టర్​లో తన చేతులు కడుక్కుంటున్న వీడియోని షేర్ చేశారు. ఈ చాలెంజ్‌ను స్వీకరించి ప్రజల్లో అవగాహన కల్పించాలని సెలబ్రిటీలు, ప్రముఖులకు విజ్ఞప్తి చేశారు. తాను చేసిన వీడియోను పోస్టు చేసి హీరోయిన్ దీపికా పదుకొణే, ప్రియాంక చోప్రా, ఆర్నాల్డ్ సహా మరికొందరిని నామినేట్ చేశారు. హీరోయిన్లు దీపికా పదుకొణే, అనుష్క శర్మ, క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, అథ్లెట్ హిమాదాస్, సెంట్రల్ మినిస్టర్లు హర్షవర్ధన్, కిరణ్ రిజిజు తదితరులు సేఫ్ హ్యాండ్స్ చాలెంజ్‌ను స్వీకరించారు. వీరందరూ హ్యాండ్స్ వాష్ చేసుకుంటున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ మరికొందరిని నామినేట్ చేస్తున్నారు. ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేసిన దీపికా పదుకొణే… రోజర్ ఫెదరర్, క్రిస్టినో రొనాల్డో, విరాట్ కోహ్లీని నామినేట్ చేశారు. పీవీ సింధూ కూడా విరాట్, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, సానియా మీర్జాలకు చాలెంజ్ విసిరారు. హిమాదాస్ సైతం కిరణ్ రిజిజు, బాలీవుడ్ హీరోలు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, సచిన్ టెండూల్కర్, సానియా మీర్జాలను నామినేట్ చేశారు.

For More News..

ఇటలీలో కరోనా రికార్డు.. నిన్న ఒక్కరోజే..

పారాసిటమాల్‌తో ఇన్‌ఫెక్షన్ తగ్గదు.. సీసీఎంబీ డైరెక్టర్

24 గంటలు.. ఆన్ డ్యూటీ.. రంగంలోకి హెల్త్ సోల్జర్స్

ఒక్కరోజే 8 పాజిటివ్ కేసులు.. మొత్తంగా 13కు చేరిక

కరోనా ఎఫెక్ట్: కరీంనగర్​లో మూడు కిలోమీటర్లు షట్​ డౌన్