ఇంద్రకీలాద్రిపై శాకాంబరీ ఉత్సవాలు ప్రారంభం

V6 Velugu Posted on Jul 22, 2021

విజయవాడలోని ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో శాకాంబరీదేవి ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. 3 రోజుల పాటు శాకాంబరీదేవి ఉత్సవాలు జరగనున్నాయి. ఇంద్రకీలాద్రిపై ఆషాఢమాసాన్ని పురస్కరించుకొని శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్నారు. అమ్మవారిని ఆకుకూరలు, పళ్లు, కూరగాయలతో అమ్మవారిని అలంకరణ చేశారు. చివరి రోజున ప్రత్యేకంగా ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించే పండ్లతో ప్రత్యేకంగా అలంకరించనున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. అమ్మవారిని రాష్ట్ర దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జి.వాణి మోహన్ దర్శించుకున్నారు.

Tagged TEMPLE, vijaywada, kanakadurga, , Sakambari, Utsavam

Latest Videos

Subscribe Now

More News