5జీ ఫోన్లకు పెరిగిన డిమాండ్ 

5జీ ఫోన్లకు పెరిగిన డిమాండ్ 

న్యూఢిల్లీ: కరోనా కంటిన్యూ అవుతూనే ఉన్నప్పటికీ, దేశమంతటా స్మార్ట్​ఫోన్ల అమ్మకాల జోరు కొనసాగుతూనే ఉంది. కంపెనీలు పంపే షిప్​మెంట్లు (కంపెనీల నుంచి సెల్లర్లకు వెళ్లే యూనిట్లు) గత ఏడాది భారీగా పెరిగాయి. మార్కెట్ రీసెర్చ్​ ఫర్మ్​ కౌంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పాయింట్ రీసెర్చ్ ప్రకారం.. సప్లై చెయిన్​ ఇబ్బందులు,  ధరల పెరుగుదల వంటి సమస్యలు ఉన్నప్పటికీ ఇండియా స్మార్ట్‌‌‌‌‌‌‌‌ఫోన్ మార్కెట్ 2021లో దూసుకెళ్లింది. ఏకంగా 169 మిలియన్ల షిప్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌లను (16.9 కోట్లు) రికార్డు చేసింది. 2020 లో జరిగిన షిప్​మెంట్లతో పోలిస్తే ఇవి11శాతం ఎక్కువ. 5జీ స్మార్ట్‌‌‌‌‌‌‌‌ఫోన్‌‌‌‌‌‌‌‌లకు డిమాండ్ పెరగడం భారీ గ్రోత్​కు కారణమని సంస్థ పేర్కొంది.  2021లో మొత్తం షిప్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌లలో 5జీ ఫోన్ల వాటా17శాతం వరకు ఉంది. 2020 తో పోలిస్తే ఆరు రెట్లు గ్రోత్​ రికార్డు అయింది. ‘‘ మిడ్ -టు -హై-ఎండ్ 5జీ స్మార్ట్‌‌‌‌‌‌‌‌ఫోన్‌‌‌‌‌‌‌‌ల అమ్మకాలు చాలా బాగున్నాయి. ఇక నుంచి కూడా ఈ విభాగం మార్కెట్ రెండంకెల గ్రోత్​ను కొనసాగిస్తుందని ఆశించవచ్చు’’ అని కౌంటర్​ పాయింట్​ ఎనలిస్టు ఒకరు చెప్పారు. దాదాపు అన్ని కంపెనీలకు మార్కెట్  అవకాశాలను ఇచ్చిందని, అమ్మకాలను పెంచుకున్నాయని అన్నారు. కంపెనీల మధ్య తీవ్రమైన పోటీ, చౌకగా 5జీ చిప్‌‌‌‌‌‌‌‌సెట్‌‌‌‌‌‌‌‌లు అందుబాటులోకి రావడం వల్ల ఈ ఏడాది 5జీ ఫోన్ల ధరలు మరింత తగ్గుతాయి.  మరిన్ని మోడల్స్​ వస్తాయి. 2021లో జూన్​ నుంచి డిసెంబరు వరకు ఎంట్రీ-లెవల్ 5జీ ఫోన్ల ధర 40 శాతానికి తగ్గింది. దీనివల్ల ఎక్కువ మంది 5జీ స్మార్ట్‌‌‌‌‌‌‌‌ఫోన్లు కొన్నారు. ఈ ప్రైస్ బ్యాండ్‌‌‌‌‌‌‌‌లలోని షిప్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌లు సంవత్సర కాలానికి 96 శాతానికి పెరిగాయి.  రూ.20 వేల కంటే ఎక్కువ ధరలు ఉన్న ఫోన్లకు  కస్టమర్ల నుంచి డిమాండ్ బాగుంది. వీటి రిటైల్ సగటు అమ్మకపు ధరలు13శాతానికి పైగా పెరిగాయి.  చాలా మంది పాత ఫోన్లను వదిలేసి కొత్తగా ప్రీమియం ఫోన్లు కొన్నారని కౌంటర్ పాయింట్​ రీసెర్చ్​ రిపోర్టు వివరించింది. మొత్తం షిప్​మెంట్లలో 47 శాతం ఫోన్లు రూ. 10 వేలు–రూ. 20 వేల మధ్య ధర కలిగినవి ఉన్నాయి. రూ. 10 వేల కంటే తక్కువ ధర ఉన్నవాటి షిప్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ల మార్కెట్ వాటా ఐదు శాతం తగ్గింది.   కాలం గడిచేకొద్దీ భారతీయులు తమ స్మార్ట్‌‌‌‌‌‌‌‌ఫోన్‌‌‌‌‌‌‌‌లపై ఎక్కువ ఖర్చుపెడుతున్నారనే దానికి ఈ షిప్​మెంట్లు రుజువని కౌంటర్​​ పాయింట్ రిపోర్టు పేర్కొంది.