
న్యూఢిల్లీ: ఈ ఏడాది జనవరిలో 8 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపించేసిన సేల్స్‌ఫోర్స్, మరింత మందిని తీసేస్తామని ప్రకటించింది. లాభాలపై ఫోకస్ పెట్టామని కంపెనీ సీఈఓ బ్రియన్ మిల్హమ్ అన్నారు. కంపెనీ స్ట్రక్చర్‌ను మారుస్తున్నామని వివరించారు. సేల్స్‌ఫోర్స్‌తో పాటు మరిన్ని టెక్ కంపెనీలు కూడా తమ ఉద్యోగులను వివిధ దశల్లో తీసేస్తున్నాయి. ఇప్పటికే వేల మంది ఉద్యోగులను తొలగించిన మెటా ప్లాట్‌ఫామ్స్, అమెజాన్, ట్విలియో ఐఎన్‌సీలు, తాజాగా మరో 21 వేల మందిని తీసేశాయి. గ్లోబల్ లెవెల్‌లో ఉద్యోగులను ఈ కంపెనీలు తొలగించాయి.
ఆకాశ ఎయిర్‌లో కొత్తగా వెయ్యి జాబ్స్..ఇండియన్ ఎయిర్‌లైన్ కంపెనీ ఆకాశ ఎయిర్ సుమారు 1,000 మందిని నియమించుకుంటామని ప్రకటించింది. వచ్చే ఏడాది మార్చి నాటికి తమ బిజినెస్‌ను మరింత విస్తరిస్తామని కంపెనీ సీఈఓ వినయ్ దూబె అన్నారు. ఈ టైమ్‌కి తమ మొత్తం ఉద్యోగుల సంఖ్య 3,000 కు చేరుకుంటుందని చెప్పారు. ఇందులో 1,100 మంది పైలెట్‌లు, ఫ్లయిట్ అటెండెంట్లు ఉంటారని వెల్లడించారు. ఏడు నెలల కింద సర్వీస్‌లు ప్రారంభించిన ఆకాశ ఎయిర్, ఈ ఏడాది చివరి నాటికి ఇంటర్నేషనల్ సర్వీస్‌లను కూడా ప్రారంభిస్తామని పేర్కొంది. కానీ, డెస్టినేషన్లను ఇంకా ప్రకటించలేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో 3,61,000 మంది ప్యాసెంజర్లను ఆకాశ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ చేసింది.