Salman Khan: సల్మాన్ పందిలా తింటాడు..దారా సింగ్‌ సంచలన వ్యాఖ్యలు

Salman Khan: సల్మాన్ పందిలా తింటాడు..దారా సింగ్‌ సంచలన వ్యాఖ్యలు

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) పందిలా తింటాడు..కుక్కలా జిమ్లో వర్క్ అవుట్ చేస్తాడంటూ తన స్నేహితుడు,నటుడు విందు దారా సింగ్ (Vindu Dara Singh) ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

అయితే, సల్మాన్ తినే తిండి ఎలా ఉంటుందో..ఫిట్‌నెస్ కూడా అంతలా మెయింటేన్ చేయడం గ్రేట్ అని అన్నారు.సల్మాన్ యొక్క అంకితభావాన్ని హైలైట్ చేస్తూ..భాయిజాన్ జీవనశైలి..ఇద్దరి మధ్య ఉన్న బంధం ఎలాంటిదో ఇలా చెప్పుకొచ్చాడు. 

దారా సింగ్ మాట్లాడుతూ..“సల్మాన్, నేను చిన్నతనం నుంచి కలిసే చదువుకున్నాం. నేను బరువు పెరగడం చూసి.. సల్మాన్ జిమ్ జాయిన్ అయ్యినట్లు చెప్తాడు.  సల్మాన్ ఎక్కువసేపు జిమ్ లోనే ఉంటాడు. 
అసలు తిండి,వ్యాయామం విషయంలో ఎలాంటి రాజీ ఉండదు. పందిలా తింటాడు..కుక్కలా జిమ్ లో వర్క్ అవుట్ చేస్తాడు. యక  ఆ తర్వాత తిన్నది ఏమైంది అడిగితే..వర్క్ అవుట్ చేసి అప్పుడే కరిగించేసాను అని చెబుతారు. నిజానికి సల్మాన్ ఒక అద్భుతమైన వ్యక్తిత్వం గలవాడు. అతనికి సాయం చేసే గుణం చాలా ఎక్కువ..చిన్నప్పటి నుంచి ఈ గుణం ఇప్పటివరకు అలాగే ఉంది. అతను నెలకు దాదాపు రూ.25- 30 లక్షల వరకు విరాళాలు ఇస్తుంటాడు.

ఇప్పటికీ సల్మాన్ కోట్లలో సంపాదించిన కూడా తన పాకెట్ మనీ మాత్రం..సల్మాన్ తండ్రి, ప్రముఖ స్క్రీన్ రైటర్ సలీం ఖాన్ దగ్గరే తీసుకుంటాడు. ఒక్క రూపాయి కూడా తన దగ్గర ఉంచుకోరు..సల్మాన్ వ్యక్తిత్వం వేరు' అంటూ విందు దార సింగ్‌ అన్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ ది బుల్, టైగర్ Vs పఠాన్‌లో నటిస్తున్నారు.