ప్రజలను మభ్యపెట్టేందుకే నితీష్‌ 'సమాధాన్ యాత్ర' : ప్రశాంత్ కిషోర్

ప్రజలను మభ్యపెట్టేందుకే నితీష్‌ 'సమాధాన్ యాత్ర' : ప్రశాంత్ కిషోర్

బీహార్ సీఎం నితీష్ కుమార్ చేపట్టిన 'సమాధాన్ యాత్ర'పై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్పందించారు. ప్రజలను మోసం చేసేందుకే ఈ యాత్ర చేపట్టారని విమర్శించారు. నితీష్ గతంలో అనేక యాత్రలు చేసిన గుర్తుచేసిన ప్రశాంత్ కిషోర్.. వాటి వల్ల రాష్ట్రానికి ఏం లాభం చేకూరిందని ప్రశ్నించారు. కేవలం ప్రజలను మభ్యపెట్టే  ప్రయత్నంలో భాగంగానే నితీష్ ఈ యాత్ర చేస్తున్నారని అన్నారు.

రాహుల్ భారత్ జోడో యాత్రలో సీఎం నితీష్ పాల్గొనకపోవడంపై ప్రశాంత్ కిషోర్ స్పందించారు. ఇతర రాజకీయ పార్టీల నాయకులు కాంగ్రెస్ యాత్రకు హాజరవుతున్నా, నితీష్ మాత్రం దానికి దూరంగా ఉన్నారని అన్నారు. 'మహాఘట్ బంధన్' ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి అయినప్పటికీ ఆ పార్టీ యాత్రపై ముఖ్యమంత్రి ఎందుకు ఆసక్తి చూపించడం లేదని ప్రశ్నించారు. అలాంటప్పుడు ఆయన ప్రతిపక్షాల ఐక్యత గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రస్తుతం నితీష్ సమాధాన్ యాత్ర నలందలో కొనసాగుతోంది.