
హైదరాబాద్, వెలుగు: తమ సంస్థలో ప్రముఖ నటి సమంత రూత్‌ప్రభు ఇన్వెస్ట్ చేసినట్టు సూపర్‌ఫుడ్ స్టార్టప్ నరిష్ యూ వెల్లడించింది. తాము క్వినోవా, చియా సీడ్స్ వంటి మిల్లెట్ ఫుడ్స్‌ను అమ్ముతున్నామని పేర్కొంది. స్థానికంగా సేకరించిన సస్టెయినబల్ సూపర్‌ఫుడ్స్‌ను కూడా తమ నుంచి కొనుక్కోవచ్చని వెల్లడించింది. సీడ్ ఫండింగ్ రౌండ్‌లో భాగంగా సమంత ఇన్వెస్ట్ చేశారు. ఈ సందర్భంగా మొక్కల ఆధారిత మిల్లెట్ మిల్క్‌ను లాంచ్‌చేశారు. ట్రయంప్ గ్రూప్‌కు చెందిన జనార్ధన రావు, డార్విన్ బాక్స్ కో–ఫౌండర్ రోహిత్ చెన్నమనేని, జెరోధా కో–ఫౌండర్ నిఖిల్ కామత్, గృహాస్ ప్రాప్‌టెక్ కో–ఫౌండర్ అభిజిత్ పాయ్, కిమ్స్ హాస్పిటల్స్ సీఈఓ అభినయ్ బొల్లినేని వంటి వారు నరిష్ యూలో పెట్టుబడులు పెట్టారు.