సమంత - నాగ్ పాన్ ఇండియా సినిమాల అప్డేట్

సమంత - నాగ్ పాన్ ఇండియా సినిమాల అప్డేట్

సమంత, నాగ చైతన్య విడిపోవటం అభిమానులకు బాధ కలిగించింది. అయితే ఈ ఇద్దరు మాత్రం.. ఎవరి కెరీర్లలో వాళ్లు బిజీ అయ్యారు. పక్కా ప్రొపెషనల్స్ లా పని చేసుకుంటున్నారు. సమంత..శాకుంతలం, యశోద లాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో సత్తా చూపించే ప్రయత్నంలో ఉంది. మరోవైపు నాగ చైతన్య..తెలుగు సినిమాలతో పాటు...అమీర్ ఖాన్ లాలా సింగ్ చద్దాలో నటిస్తూ..మొదటి సారి..బాలీవుడ్ ఆడియన్స్ కు పరిచయం అయితున్నాడు.
సమంత నటించిన యశోద పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అవుతోంది. ఇప్పటికే ఫ్యామిలీ మాన్ 2 వెబ్ సిరీస్ తో ..హిందీ ప్రేక్షకులను ఆకట్టుకున్న సమంత..యశోద సినిమాతో .. అక్కడ మరోసారి గుర్తుంపు తెచ్చుకోవాలనుకుంటోంది. ఆగస్ట్ 12 న ఈ సినిమా విడుదల చేయాలని నిర్ణయించారు. ఇక..నాగ చైతన్య నటిస్తున్న మొదటి హిందీ సినిమా..లాల్ సింగ్ చద్దా..ఆగస్ట్ 13 న రిలీజ్ చేయాలని ఫిక్స్ చేసుకున్న విషయం తెలిసిందే. లాల్ సింగ్ చద్దా కూడా పాన్ ఇండియా సినిమానే. మరి..పక్క పక్క తేదీలలో.. ఒక్కరోజు తేడాలో విడుదలవుతున్న ఈ సినిమాల ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.

 

ఇవి కూడా చదవండి

తప్పిదాలు బయటకొస్తాయనే రావొద్దంటున్నారు

కుట్ర జరుగుతుంటే నిఘా విభాగం ఏం చేస్తోంది