
ఇటీవల ‘శాకుంతలం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సమంత.. విజయ్ దేవరకొండకు జంటగా ‘ఖుషి’ చిత్రంలో నటిస్తోంది. అలాగే ‘సిటాడెల్’ హిందీ వెర్షన్ వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. తాజాగా ఆమె ఓ ఇంగ్లీష్ సినిమాలో హీరోయిన్‌గా నటించబోతోంది.
‘చెన్నై స్టోరీ’ అనే టైటిల్‌తో తెరకెక్కే ఈ చిత్రాన్ని ఫిలిప్ జాన్ డైరెక్ట్ చేయబోతున్నాడు. ఇంగ్లాండ్‌కు చెందిన వివేక్ కల్రా ఇందులో హీరోగా నటించనున్నాడు. చెన్నైకు చెందిన యువతికి, ఇంగ్లాండ్‌కు చెందిన యువకుడికి మధ్య జరిగే లవ్ స్టోరీనే ఈ మూవీ కాన్సెప్ట్. సమంత పుట్టి పెరిగిందంతా చెన్నైలోనే కనుక.. నేటివిటీ కోసం ఆమెను ఈ పాత్రకు తీసుకున్నట్టు తెలుస్తోంది. త్వరలో షూటింగ్ మొదలవబోతోంది.
ఇక ప్రస్తుతం సమంత నటిస్తున్న ‘సిటాడెల్’ వెబ్ సిరీస్‌కు సంబంధించి ఇటీవల ముంబైలో ఓ షెడ్యూల్ పూర్తయింది. వరుణ్ ధావన్, సమంత మధ్య కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. మరోవైపు ‘ఖుషి’ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తున్న ఈ రొమాంటిక్ లవ్‌స్టోరీ సెప్టెంబర్ 1న విడుదల కానుంది.