శామ్​సంగ్​ఎస్​23 సిరీస్ ఫోన్లు లాంచ్​

శామ్​సంగ్​ఎస్​23 సిరీస్ ఫోన్లు లాంచ్​

హైదరాబాద్​, వెలుగు: దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్​ కంపెనీ శామ్​సంగ్​తన ఫ్లాగ్​షిప్ గెలాక్సీ ఎస్​23 సిరీస్‌‌‌‌ ఫోన్లను హైదరాబాద్​లో మంగళవారం లాంచ్​ చేసింది. బుకింగ్స్​ ఓపెన్​ చేసిన 24 గంటలలోనే 1.40 లక్షలకుపైగా ఆర్డర్లు వచ్చాయని ప్రకటించింది.  ఈ కొత్త గెలాక్సీ ఎస్​23 సిరీస్ ఫోన్లను నోయిడా ఫ్యాక్టరీలో తయారు చేస్తామని శామ్​సంగ్​ ఇండియా మొబైల్ బిజినెస్ జనరల్ మేనేజర్ అక్షయ్ గుప్తా తెలిపారు. ఇందులోని కెమెరా సెన్సర్లు తక్కువ వెలుతురులోనూ క్వాలిటీ పిక్చర్స్​ తీస్తాయని, క్వాల్​కామ్​ స్నాప్​డ్రాగన్​8 జెన్​ 2 ప్రాసెసర్​ వల్ల చాలా స్పీడ్​గా గేమ్స్​ ఆడుకోవచ్చని చెప్పారు.  వీటి తయారీ కోసం పర్యావరణ అనుకూల ప్రీ-కన్జూమర్ రీసైకిల్డ్ అల్యూమినియమ్, రీసైకిల్డ్ గ్లాస్,  పోస్ట్-కన్జూమర్ రీసైకిల్డ్ ప్లాస్టిక్స్​ను వాడామని తెలిపారు. గెలాక్సీ ఎస్​23 సిరీస్ ఫోన్లకు  నాలుగు ఓఎస్​ అప్‌‌‌‌గ్రేడ్స్,  ఐదు సంవత్సరాల వరకు సెక్యూరిటీ ప్యాచెస్​లు వస్తాయి.  

గెలాక్సీ ఎస్​23 అల్ట్రా ధరలు రూ.1.24 లక్షల నుంచి రూ.1.55 లక్షల వరకు ఉంటాయి. గెలాక్సీ ఎస్​23 ప్ల ధరలు రూ.95 వేల నుంచి రూ. 1.05 లక్షల వరకు, గెలాక్సీ ఎస్​23 ధరలు  రూ.74,999 నుంచి రూ.79,999 వరకు ఉంటాయి.  గెలాక్సీ ఎస్​23 అల్ట్రాను ప్రి-బుక్​  చేసుకుంటే గెలాక్సీ వాచ్ ఎల్​ఈటీ క్లాసిక్  గెలాక్సీ బడ్స్2ని రూ. 4999లకే పొందవచ్చు. గెలాక్సీ ఎస్​23 ప్లస్​ను ప్రి-బుక్​ చేసుకున్న వాళ్లకు గెలాక్సీ వాచ్4 బీటీని రూ. 4999లకు పొందవచ్చు. గెలాక్సీ ఎస్​23ని ప్రి-బుక్​ చేసుకున్న వాళ్లకు రూ. 5000 విలువైన స్టోరేజ్​ అప్​గ్రేడ్​ వర్తిస్తుంది.  అంతేగాక రూ 8000 విలువైన బ్యాంక్ క్యాష్‌‌‌‌బ్యాక్‌‌‌‌ని ఆన్‌‌‌‌లైన్ ఛానెల్స్ లో పొందవచ్చు. గెలాక్సీ ఎస్​23 సిరీస్ కొనుగోలు పైన కొనుగోలుదారులు 24 నెలల నో కాస్ట్​ ఈఎంఐని కూడా ఎంచుకోవచ్చు. ఇదిలా ఉంటే గెలాక్సీ బుక్​ ల్యాప్​టాప్​ ధరలు రూ.1.09 లక్షల నుంచి రూ.2.82 లక్షల వరకు ఉన్నాయి. గెలాక్సీ బుక్స్​పైనా పలు ఆఫర్లు ఉన్నాయని శామ్​సంగ్​ తెలిపింది. తాము తెలుగు రాష్ట్రాల్లో 100 దాకా ఎక్స్​క్లూజివ్​ స్టోర్లను నిర్వహిస్తున్నామని, దేశవ్యాప్తంగా 1,700 షాప్స్​ ఉన్నాయని పేర్కొంది.