PSL 2024: సానియా మీర్జా అంటూ కేకలు.. కోపంతో వెళ్లిపోయిన సనా జావేద్

PSL 2024: సానియా మీర్జా అంటూ కేకలు.. కోపంతో వెళ్లిపోయిన సనా జావేద్

పాకిస్థాన్‌ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌.. సనా జావేద్‌తో మూడో పెళ్లి చేసుకున్నట్లు ప్రకటించిన తర్వాత ఈ మాజీ ఆటగాడిపై విమర్శలు ఎక్కువయ్యాయి. మాలిక్ తో పాటు సనా జావెద్ ను టార్గెట్ చేస్తూ నెటిజన్స్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వీరి వివాహం జరిగి నెల రోజులు దాటినా వీరి మీద ట్రోలింగ్ ఆగట్లేదు. ఎవ్వరినీ పట్టించుకోకుండా వీరి పాటికి వీరు సైలెంట్ గా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే మాలిక్ భార్య సనా జావెద్ కు తొలిసారిగా ప్రేక్షకుల నుంచి ప్రత్యక్షంగా చేదు అనుభవం ఎదురైంది.
  
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2024  లో భాగంగా ఆదివారం (జనవరి 18) ముల్తాన్ సుల్తాన్స్‌తో కరాచీ కింగ్స్ తలపడాల్సి ఉంది. ఈ లీగ్ లో కరాచీ కింగ్స్ తరపున ఆడుతున్న మాలిక్ ఆటను చూడటానికి సనా వచ్చింది. ఇన్నింగ్స్ బ్రేక్ తర్వాత ఆమె నడుచుకుంటూ వెళ్తుండగా ఆమెను అక్కడ ఉన్న ప్రేక్షకులు సానియా మీర్జా అంటూ ఆట పట్టించారు. అక్కడ ఉన్న ఒక వ్యక్తి పదే పదే సానియా జపం చేయడంతో ఆమె కాస్త అసంతృప్తికి లోనైట్లు తెలుస్తుంది. కోపంగా వెనక్కి చూస్తూ వేగంగా నడుచుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఇటీవలే హానీ మూన్ ఫోటోను మాలిక్ భార్య సనా జావేద్ తన ఇన్‌స్టాగ్రామ్ లో ఫిబ్రవరి 8న పోస్ట్ చేసింది. రూఫ్‌టాప్ పూల్‌సైడ్‌లో పసుపు, తెలుపు కలర్ చారలతో రెండు జతల పాదాలతో ఉన్న ఫోటోను షేర్ చేయడంతో.. ఈ చిత్రాన్ని చూసిన నెటిజన్స్ ఈ జంటను దారుణంగా ట్రోల్స్ చేశారు. ఆమెను హౌస్ బ్రేకర్ అంటూ మండిపడ్డారు. మొదట అయేషా సిద్దిఖీని రహస్యంగా వివాహమాడిన షోయబ్.. 2010లో ఆమెకు విడాకులిచ్చిన వెంటనే సానియా మీర్జాను పెళ్లాడాడు. వీరిది ప్రేమ వివాహం. ఈ జంటకు ఇజాన్ మీర్జా అనే ఒక కుమారుడు ఉన్నాడు. వారం రోజుల క్రితం ఆమెకు గుడ్ బై చెప్పి.. పాకిస్తానీ నటి సనా జావేద్ ను మనువాడాడు.