Sandeep Kishan Project-Z: ఏడేళ్లుగా వెయిటింగ్.. ఎట్టకేలకు రిలీజ్ అవుతున్న ప్రాజెక్ట్ Z

Sandeep Kishan Project-Z: ఏడేళ్లుగా వెయిటింగ్.. ఎట్టకేలకు రిలీజ్ అవుతున్న ప్రాజెక్ట్ Z

భాషతో సంబంధం లేకుండా ప్రతీ ఇండస్ట్రీలో సినిమాలు వాయిదా పడటం అనేది సాధారణమైన విషయమే. అన్ని కార్యక్రమాలు పూర్తయినప్పటికే కొన్ని అనుకోని కారణాల వల్ల సినిమాలు పోస్ట్ పోన్ అవుతూ ఉంటాయి. అయితే.. ఆ వాయిదా కూడా రోజులు, నెలలు అంటే ఒకే కానీ, ఒక సినిమా మాత్రం దాదాపు ఏడేళ్లుగా విడుదలకు నోచుకోక వెయిటింగ్ లో ఉంది. అదే సందీప్ కిషన్(Sandeep kishan) హీరోగా 2017లో వచ్చిన మాయావన్(Mayavan). దర్శకుడు సివి కుమార్(CV Kumar) తెరకెక్కించిన ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ తమిళంలో మంచి విజయం సాధించింది.

దాంతో.. ఆ తరువాతి సంవత్సరం 2018లోనే ఈ సినిమాను ప్రాజెక్టు-Z(Project-Z) పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేశారు మేకర్స్. టీజర్, ట్రైలర్ కూడా విడుదల అయ్యాయి కానీ, సినిమా మాత్రం రిలీజ్ అవలేదు. ఇక అప్పటినుండి ఈ సినిమా విడుదల కోసం ఎదురుచూస్తూనే ఉంది. ఇక.. ఎట్టకేలకు దాదాపు ఏడేళ్ల తరువాత ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా లేటెస్ట్ రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. ఏప్రిల్ 7న విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీంతో.. ఈ సినిమా కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఆడియన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరి ఇన్నేళ్ల తరువాత వస్తున్న ఈ సినిమా సందీప్ కిషన్ కు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి. 

ఇక సందీప్ కిషన్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన ఊరు పేరు భైరవకోన సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. చాలా కాలం హిట్టు లేక సతమతమవుతున్న ఆయనకి ఈ సినిమా మంచి కంబ్యాక్ ని ఇచ్చింది. అదే ఊపులో ఇటీవలే దర్శకుడు త్రినాథరావు నక్కినతో తన నెక్స్ట్ సినిమాను ప్రకటించాడు సందీప్ కిషన్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే   మొదలుకానుంది.