ఉత్కంఠ రేపుతున్న భైరవకోన..ఫాంటసీ మేకింగ్ వీడియో

ఉత్కంఠ రేపుతున్న భైరవకోన..ఫాంటసీ మేకింగ్ వీడియో

టాలీవుడ్‌ యువ హీరో సందీప్ కిషన్ (Sundeep Kishan) నటిస్తోన్న మోస్ట్ వెయిటెడ్ ఫిల్మ్ ఊరు పేరు భైరవకోన (Ooru Peru Bhairavakona)  డైరెక్ట్‌ చేస్తున్న ఈ చిత్రంలో వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. లేటెస్ట్ గా ఈ సినిమా నుంచి భైరవకోన టీం మేకింగ్ వీడియోను షేర్ చేశారు. 

ఊరు పేరు భైరవకోన సినిమాలో బసవ లింగం అనే క్యారెక్టర్లో హీరో సందీప్ కిషన్ నటిస్తున్నట్లు తెలిపారు. భైరవకోన కు సంబంధించిన విషయాలను మేకర్స్ షేర్ చేసుకుంటూ..షూటింగ్ టైంలోని తమ అనుభవాలను ఈ వీడియోలో తెలియజేశారు.

ఈ సినిమా 80 శాతం వరకు రాత్రి టైంలోనే జరిగే సంఘటనలతో ఉన్నందున..లైటింగ్ విషయంలో..కాస్ట్యూమ్స్ విషయంలో చాలా ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకున్నట్లు మేకర్స్ వివరించారు. డైరెక్టర్ వీఐ ఆనంద్‌ మాట్లాడుతూ..కథ, స్క్రీన్‌ ప్లే, బసవ లింగం క్యారెక్టర్, లవ్ సీన్స్ చాలా ఇంటెన్స్గా ఉంటాయని..ఈ సినిమా థియేటర్లో చూస్తేనే..థ్రిల్ ఫీల్ అవ్వగలరని వివరించారు.

Also Read :- కంగువ ఇంటెన్స్ పెంచేసింది..ఆటవిక యోధుడిగా సూర్య వైల్డ్ లుక్

ఇప్పటికే బైరవకోన నుంచి రిలీజైన నిజమేనే చెప్తున్నా..జానే జానా సాంగ్ ఆడియన్స్ ను ఫిదా చేసింది. ఈ ఒక్క సాంగ్ తో ఆడియన్స్ థియేటర్ కి వెళ్లి చూడాలని..ఫిక్స్ అయ్యారు. ఇక ఇప్పుడు రిలీజ్ చేసిన మేకింగ్ వీడియోతో ఆడియన్స్ లో అంచనాలు పెంచేశారు. ప్రేక్షకులను ఫాంటసీ ప్రపంచానికి తీసుకు వెళ్లే బైరవ కోన విజువల్‌ ట్రీట్‌ వచ్చే చూడడానికి రెడీగా ఉండండి.ఈ సినిమాను రాజేష్ దండ తో కలిసి అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు