
ఒక ప్రొడ్యూసర్ తనను ఒంటరిగా పిలిచాడని చెప్పి షాకిచ్చింది బాలీవుడ్ నటి సంగీతా ఒడ్వాని. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. క్యాస్టింగ్ కౌచ్ పై మీ అభిప్రాయం ఏంటి? మీకు అలాంటి సంఘటనలు ఎదురయ్యాయా అన్న ప్రశ్నకు బదులుగా సంగీతా ఒడ్వానిమాట్లాడుతూ.. ‘కెరీర్ తొలినాళ్లలో నాకు ఇండస్ట్రీలో ఎలా ఉంటుంది, ఎవరితో ఎలా ఉండాలి అనేది పెద్దగా తెలియదు.
అందుకే అందరితో సరదాగా ఉండేదాన్ని. కొన్నాళ్ల తర్వాత ఓ స్టార్ ప్రొడ్యూసర్ నాతో మిస్ బిహేవ్ చేశాడు. ఓ రోజు సినిమా గురించి మాట్లాడటానికి ఇంటికి రామన్నాడు. అయితే నన్ను ఒంటరిగా మాత్రమే రావాలని పదే పదే చెప్పడంతో నాకు డౌట్ వచ్చింది. అందుకే నా ఫ్రెండ్స్‌ని కూడా తీసుకొని వెళ్లాను. నేను సింగిల్‌గా వెళ్లకపోవడంతో అతనికి కోపం వచ్చింది. వేరే పని పడిందంటూ హడావుడిగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత కూడా నన్ను ఒంటరిగా కలిసేందుకు చాలా ప్రయత్నించాడు. కానీ నేను దూరం పెట్టేశాను.
నిజానికి అతనికి అమ్మాయిలు అంటే పిచ్చి. సినిమా అవకాశాల పేరుతో వారిని లొంగదీసుకుంటాడు’ అని చెప్పుకొచ్చింది సంగీత. ‘శుభ్ మంగళ్ మే దంగల్’ ఫేం సంగీతా ఒడ్వాని చేసిన ఈ కామెంట్స్ బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గ మారాయి.