Rakaasa Review: ‘రాకాస’' ప్రీమియర్స్ రివ్యూ.. కామెడీ పంచ్‌లతో సంగీత్ హారర్ ఎంటర్‌టైనర్

Rakaasa Review: ‘రాకాస’' ప్రీమియర్స్ రివ్యూ.. కామెడీ పంచ్‌లతో సంగీత్ హారర్ ఎంటర్‌టైనర్

సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా మానస శర్మ తెరకెక్కించిన చిత్రం ‘రాకాస’ (Rakaasa). జీ స్టూడియోస్ సమర్పణలో నిహారిక కొణిదెల నిర్మించిన ఈ సినిమా ఇవాళ ఏప్రిల్‌‌ 3న థియేటర్లోకి వచ్చింది. గురువారం రాత్రి (ఏప్రిల్ 2న) ప్రీమియర్స్ ప్రదర్శించారు మేకర్స్.

ప్రీమియర్స్ చూసిన ఆడియన్స్ నుంచి సినిమాకు పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా సంగీత్ శోభన్ ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్, కామెడీ టైమింగ్, పంచ్ డైలాగ్స్‌తో స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ఆకట్టుకున్నాడని ఆడియన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

డైరెక్టర్ మానస శర్మ (Manasa Sharma) విషయంలో, దర్శకత్వం కంటే రచయితగా ఎక్కువగా మెప్పించారని టాక్ వినిపిస్తోంది. కథలో ఉన్న కామెడీ ఎలిమెంట్స్, డైలాగ్ రైటింగ్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయని చెబుతున్నారు.

ఓవరాల్‌గా ఫస్ట్ హాఫ్ పూర్తి ఫన్ వేలో సాగుతుండగా, సెకండ్ హాఫ్‌లో వచ్చే ట్విస్ట్‌లు ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తున్నాయని ప్రీమియర్స్ ఆడియన్స్ రివ్యూలు ఇస్తున్నారు. కామెడీ, హారర్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మిక్స్‌తో ‘రాకాస’ మంచి ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుందని టాక్.

రాకాస కథ:

రాకవనం గ్రామానికి చెందిన వీరబాబు అలియాస్ వీర (Sangeeth Shobhan) ప్రేమ కోసం అమెరికా నుంచి వస్తాడు. కానీ అతను ప్రేమించిన సుకన్య మాత్రం మోసం చేసి మరొకరిని పెళ్లి చేసుకుంటుంది. దీంతో వీర నిరాశలో పడతాడు. అదే సమయంలో సోము (Vennela Kishore) హత్య కేసులో అతనిపై అనుమానం రావడంతో అతని పాస్‌పోర్ట్ ను పోలీసులు స్వాధీనం చేసుకుంటారు.

ఇదిలా ఉంటే, రాకవనం గ్రామంలో ఉన్న పాడుబడ్డ కోటలో రాక్షసుడికి నరబలి ఇచ్చే ఆనవాయితీ ఉంటుంది. చివరికి కొన్ని అనూహ్య పరిస్థితుల వల్ల వీరనే ఆ కోటలోకి వెళ్లాల్సి వస్తుంది.

అక్కడ అతడికి ఎదురయ్యే భయానక సంఘటనలు, సుబ్బలక్ష్మి (నయన్ సారిక ) ప్రవేశం, అలాగే చనిపోయాడని అనుకున్న సోము అక్కడ కనిపించడం కథకు ట్విస్ట్ ఇస్తాయి. ఇంతకీ ఆ రాకవనంలో రాక్షసుడి రహస్యం ఏమిటి? వీర, సుబ్బలక్ష్మి అక్కడి నుంచి బయటపడతారా? అన్నదే మిగతా కథ.

రామ్ చరణ్‌‌ ప్రశంసలు:

గురువారం ఏప్రిల్ 2న ప్రీ రిలీజ్ ప్రెస్‌‌మీట్ నిర్వహించారు మేకర్స్. ఈ సందర్భంగా సంగీత్ శోభన్ మాట్లాడుతూ ‘రీసెంట్‌‌గా రామ్ చరణ్‌‌ గారిని కలవగా మా సినిమా గురించి  గొప్పగా మాట్లాడారు. ఆయన చాలా ఎంకరేజ్ చేశారు. మా సినిమాతో  పూర్తి వినోదాన్ని అందించే ప్రయత్నం చేశాం. కచ్చితంగా అందర్నీ అలరిస్తుంది’ అని అన్నాడు.

ఈ చిత్రం తన కెరీర్‌‌‌‌లో స్పెషల్‌‌గా నిలుస్తుందని హీరోయిన్ నయన్ సారిక చెప్పింది. కుటుంబమంతా కలిసి ఓ అందమైన చందమామ కథను చూసి ఎంటర్‌‌‌‌టైన్‌‌ అయ్యేలా ‘రాకాస’ ఉంటుందని  డైరెక్టర్  మానస శర్మ  చెప్పారు. నిహారిక కొణిదెల మాట్లాడుతూ ‘ఫస్ట్ ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ వరకు క్లీన్ కామెడీతో ఫ్యామిలీ అంతా కలిసి చూసి హాయిగా నవ్వుకునేలా  మా చిత్రం ఉంటుంది.

పూర్తిగా హారర్  థ్రిల్లర్ అని కాకుండా.. కామెడీ, ఫ్యాంటసీ, అడ్వెంచర్‌‌‌‌ లాంటి  అన్ని రకాల ఎలిమెంట్స్‌‌తో కావాల్సినంత ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్ ఉంటుంది’ అని అన్నారు. కో ప్రొడ్యూసర్  మన్యం రమేష్,  జీ స్టూడియో కంటెంట్ వైస్ ప్రెసిడెంట్ దివ్య  పాల్గొన్నారు.