
జయశంకర్ భూపాలపల్లి/మహదేవ్‌పూర్, వెలుగు : సరస్వతి పుష్కరాల సందర్భంగా కాళేశ్వరంలో డ్యూటీ చేస్తున్న పారిశుధ్య కార్మికుడు వడదెబ్బతో మంగళవారం చనిపోయాడు. వివరాల్లోకి వెళ్తే... భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గంగారం గ్రామానికి చెందిన మంతె శ్రీనివాస్ (35) మూడు రోజులుగా కాళేశ్వరంలో మల్టీ పర్పస్‌వర్కర్‌గా పనిచేస్తున్నాడు. డ్యూటీలో ఉన్న టైంలోనే తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతడిని మహదేవపూర్ హాస్పిటల్‌కు తరలించగా అక్కడ ట్రీట్‌మెంట్ తీసుకుంటూ సోమవరం రాత్రి చనిపోయాడు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు, కొడుకు ఉన్నారు.