V6 News

జీవన్ రెడ్డిది ఐరన్ లెగ్..ఆయన చేరికతో బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌లో ముసలం:జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్

జీవన్ రెడ్డిది ఐరన్ లెగ్..ఆయన చేరికతో బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌లో ముసలం:జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్

జగిత్యాల టౌన్, వెలుగు: జీవన్‌‌‌‌‌‌‌‌రెడ్డిది ఐరన్​లెగ్​ అని, ఆయన చేరికతో బీఆర్ఎస్​లో ముసలం మొదలైందని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌‌‌‌‌‌‌‌ కుమార్ కామెంట్‌‌‌‌‌‌‌‌ చేశారు. జగిత్యాలలోని కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో మీడియాతో మాట్లాడుతూ.. జీవన్‌‌‌‌‌‌‌‌రెడ్డిని 'ఐరన్ లెగ్'గా అభివర్ణించారు. గతంలో ఆయన వల్ల ఎన్టీఆర్ పదవి కోల్పోయారని, ఆయన గెలిచినప్పుడు వైఎస్ఆర్ స్వర్గస్థులయ్యారని గుర్తు చేశారు. 

మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌లో చేరుతుండగా, ఆయన చేరికను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న సీనియర్ నేత హరీశ్‌‌‌‌‌‌‌‌రావు జగిత్యాల సభకు రాకుండా రహస్యంగా ఢిల్లీ వెళ్లారన్నారు. ఏడాది తర్వాత కేసీఆర్ బహిరంగ సభకు వస్తున్నా.. హరీశ్‌‌‌‌‌‌‌‌రావు గైర్హాజరు కావడం వెనుక బలమైన అసంతృప్తి ఉన్నట్లు తెలుస్తోందన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు గాజంగి నందయ్య, మున్సిపల్ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌ సమిండ్ల వాణి, పార్టీ నాయకులు పాల్గొన్నారు.