లంక టూర్‌లో కుర్రాళ్లకు ఛాన్స్ ఇవ్వాలి

లంక టూర్‌లో కుర్రాళ్లకు ఛాన్స్ ఇవ్వాలి

ముంబై: లిమిటెడ్ ఓవర్ల సిరీస్ ఆడేందుకు వచ్చే నెలలో శ్రీలంకకు భారత్ పయనం కానుంది. మూడు వన్డేలు, రెండు టీ20ల ఈ సిరీస్ కు.. కోహ్లీ, బుమ్రా, కేఎల్ రాహుల్ లాంటి స్టార్లు దూరంగా ఉండనున్నారు. వీరితోపాటు మరికొందరితో కూడిన మెయిన్ టీమ్ ఇంగ్లండ్ కు వెళ్లనుంది. అక్కడ వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ తోపాటు ఇంగ్లండ్ తో ప్రత్యేక సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో శ్రీలంక టూర్ లో యంగ్ ప్లేయర్ లకు సత్తా చాటేందుకు మంచి అవకాశం దక్కనుంది. ఈ విషయంపై మాజీ టీమిండియా బ్యాట్స్ మన్ సంజయ్ మంజ్రేకర్ స్పందించాడు. ఈ పర్యటనలో చేతన్ సకారియా, రాహుల్ తేవాటియాకు లాంటి కుర్రాళ్లకు ఎక్కువ ఛాన్సులు ఇవ్వాలని సూచించాడు.

'లంక టూర్ లో ఇషాన్ కిషన్ వికెట్ కీపింగ్ చేసే అవకాశం ఉంది. నా దృష్టిలో అతడు నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు దిగాలి. అతడి తర్వాత మనీశ్ పాండే, హార్దిక్ పాండ్యా క్రీజులోకి రావాలి. ఐపీఎల్ లో ఆకట్టుకున్న చేతన్ సకారియా, రాహుల్ తేవాటియాకు ఛాన్సులు ఇవ్వాలి. సంజూ శాంసన్ కూడా మంచి ప్రతిభావంతుడు. అతడికీ అవకాశాలు ఇవ్వాలి.  భువనేశ్వర్ కుమార్, దీపక్ చహర్ ఫైనల్ ఎలెవెన్ లో ఉంటే జట్టు సమతూకంతో ఉంటుంది' అని మంజ్రేకర్ పేర్కొన్నాడు.