డిసెంబర్ 5న డీసీసీ అధ్యక్షుడి బాధ్యతల స్వీకరణ : టీపీసీసీ అధికార ప్రతినిధి జహీర్ అక్తర్

డిసెంబర్ 5న డీసీసీ అధ్యక్షుడి బాధ్యతల స్వీకరణ : టీపీసీసీ అధికార ప్రతినిధి జహీర్ అక్తర్

మహబూబ్​నగర్, వెలుగు : ఏఐసీసీ ఆధ్వర్యంలో సంఘటన్ సృజన్ అభియాన్ ద్వారా దేశవ్యాప్తంగా డీసీసీ అధ్యక్షుల నియామకం చేపట్టినట్లు టీపీసీసీ అధికార ప్రతినిధి జహీర్ అక్తర్ తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ లో 30 ఏండ్ల నుంచి క్రమశిక్షణ గల బీసీ నాయకుడు సంజీవ్ ముదిరాజ్ ను డీసీసీ అధ్యక్షుడిగా నియమించినట్లు తెలిపారు.

 రాష్ట్రంలో 14 మంది బీసీలను డీసీసీ అధ్యక్షులుగా నియమించినట్లు చెప్పారు. ఈనెల 5న నూతన డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఉదయం 10 గంటలకు ఆయన ఇంటి నుంచి పార్టీ కార్యాలయం వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వస్తామన్నారు. అనంతరం 11 గంటలకు సంజీవ్​ముదిరాజ్ పదవీ బాధ్యతలు స్వీకరిస్తారని తెలిపారు. 

ఈ కార్యక్రమానికి చల్లా వంశీచంద్ రెడ్డి, మంత్రులు జూపల్లి కృష్ణారావు. వాకిటి శ్రీహరితోపాటు ఎమ్మెల్యేలు, పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంత్​రావు, ఇతర సీనియర్ నాయకులు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్ పర్సన్ బెక్కరి అనిత, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్ గౌడ్, నాయకులు చంద్రకుమార్ గౌడ్. డీసీసీ మీడియా సెల్ కన్వీనర్ సీజే బెనహర్, నాయకులు  తదితరులు పాల్గొన్నారు.