ఆర్మూర్, వెలుగు : తెలంగాణలోనూ బీజేపీ సర్కార్ రావడం ఖాయమని మహారాష్ట్రలోని వాని నియోజకవర్గ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి అన్నారు. గురువారం ఆర్మూర్ లో బీజేపీ ఎమ్మెల్యే ప్రవాస్ యోజన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హజరైన సంజీవ్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణలో బీఆర్ఎస్ అవినీతి, అక్రమాలను చూసి విసుగు చెందిన ప్రజలు బీఆర్ఎస్ ను గద్దె దింపి బీజేపీకి అధికారం ఇచ్చేందుకు రెడీ అవుతున్నారని చెప్పారు. డబుల్ ఇంజన్ సర్కారు తోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు.
ఆర్మూర్ లో ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని తరిమి కొట్టేందుకు బీజేపీకి ఓటు వేయాలని కోరారు. బీజేపీ అదిలాబాద్ ఇన్చార్జి అల్జాపూర్ శ్రీనివాస్, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి జెస్సు అనిల్, కిసాన్ మోర్చా జిల్లా ప్రెసిడెంట్ నూతుల శ్రీనివాస్, పుప్పాల శివరాజ్ , మాజీ మున్సిపల్ చైర్మర్ కంచెట్టి గంగాధర్, బీసీ మోర్చా ప్రెసిడెంట్ యమాద్రి భాస్కర్, పాలెపు రాజు పాల్గొన్నారు.
కామారెడ్డిలో కాషాయ జెండా
కామారెడ్డి టౌన్ : కామారెడ్డి లో కాషాయ జెండా ఎగుర వేయడం ఖాయమని మహారాష్ర్టలోని అక్కల్కోట ఎమ్మెల్యే సచిన్ కళ్యాణ్ శెట్టి అన్నారు. ఎమ్మెల్యే ప్రవాస యోజన ప్రోగ్రాంలో భాగంగా గురువారం కామారెడ్డి మండలం నర్సన్నపల్లిలో కామారెడ్డి, రాజంపేట మండలాల పార్టీ మీటింగ్ నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. క్రమ శిక్షణ కలిగిన కార్యకర్తలు బీజేపీలోనేఉంటారన్నారు. నియోజక వర్గ ఇన్చార్జి కాటిపల్లి వెంటకటరమణరెడ్డి, కన్వీనర్ లక్ష్మారెడ్డి, లీడర్లు ప్రదీప్ పాల్గొన్నారు.
రాష్ట్రంలో బీజేపీ ని అధికారంలోకి తీసుకురావాలి.
ఇందల్వాయి : రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ పార్టీ ని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని అస్సాం రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే తరంగ్ గోగొయ్ అన్నారు. గురువారం మండలంలోని నల్లవెల్లి గ్రామంలో నిర్వహించిన మండల కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. అవినీతి రహిత పాలన కోసం బీజేపీ కి ఓటు వేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కులాచారి దినేశ్, మండల అధ్యక్షుడు నాయిడి రాజన్న, లీడర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.