ఆదర్శ పురుషుడు సేవాలాల్ మహారాజ్

ఆదర్శ పురుషుడు సేవాలాల్ మహారాజ్

ఇల్లెందు, వెలుగు : సంత్ సేవాలాల్ మహారాజ్ ఆదర్శ పురుషుడని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ డాక్టర్​ ప్రియాంక అల, ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. మంగళవారం జేకే కాలనీలోని సింగరేణి హైస్కూల్​ గ్రౌండ్​లో ఆల్  ఇండియా బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి ఉత్సవాల ముగింపు సందర్భంగా  భోగ బండార్​ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా హాజరైన ఎమ్మెల్యే, కలెక్టర్​కు​ బంజారా సంప్రదాయం ప్రకారం ఘనంగా స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లంబాడి, బంజారా తెగల జీవన విధానం బాగుపడేందుకు పేవాలాల్​ చేసిన కృషి మరువలేనిదన్నారు. సేవాలాల్ చూపించిన మార్గంలో నడవాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్పీ రోహిత్ రాజ్, మాజీ కేంద్రమంత్రి పోరిక బలరాం నాయక్, సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ కమిటీ సభ్యుడు బెల్లయ్య నాయక్, స్థానిక సేవాలాల్ సేన కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు  తదితరులు పాల్గొన్నారు.