రీసెంట్‌గా ‘కపుల్ ఫ్రెండ్లీ’ చిత్రంతో ఆడియెన్స్ ముందుకొచ్చిన సంతోష్ శోభన్.. ఆదివారం తన నెక్స్ట్ మూవీ అప్‌డేట్ అందించాడు. ‘స్వాతిముత్యం’ ఫేమ్ లక్ష్మణ్ కె కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ‘సత్తిబాబు పరలోక యాత్ర’ అనే టైటిల్‌ను రివీల్ చేశారు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఏఆర్ ఫిలింస్ సంస్థ తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను నిర్మిస్తోంది. కంప్లీట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్‌ను జూన్ ఫస్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేయనున్నట్టు మేకర్స్ తెలియజేశారు. త్వరలోనే మరిన్ని వివరాలను వెల్లడిస్తామన్నారు.
