ముందు పరీక్ష రాయండి.. ఆ తర్వాత ఓటేస్తాం

ముందు పరీక్ష రాయండి.. ఆ తర్వాత ఓటేస్తాం

సుందర్బన్: ఒడిశా పంచాయతీ ఎన్నికల్లో ఓ గ్రామస్థులు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. సర్పంచ్ అభ్యర్థులకు రాత పరీక్ష పెట్టారు. గ్రామంలో సమస్యలపై వారుకున్న అవగాహన, వాటి పరిష్కారానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్న విషయాన్ని పరీక్షించారు. సుందర్బన్ జిల్లాలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. 

సుందర్భన్ జిల్లా కుట్రా గ్రామ్ పంచాయతీ పరిథిలోని ఆదివాసీ గ్రామమైన మాలుపడాలో ఫిబ్రవరి 18న పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో గ్రామాభివృద్ధికి పాటు పడే వ్యక్తినే సర్పంచ్గా ఎన్నుకోవాలని డిసైడైన గ్రామస్తులు ఓ నిర్ణయం తీసుకున్నారు. సర్పంచ్ బరిలో ఉన్న అభ్యర్థులకు మౌఖిక, రాత పరీక్ష నిర్వహించారు. గురువారం తొమ్మిది మంది అభ్యర్థులను స్థానిక పాఠశాల ప్రాంగణంలోకి పిలిచిన గ్రామస్థులు వారికి రాత పరీక్ష పెట్టారు. అందులో ఎక్కువ మార్కులు పొందిన వారికే తాము ఓట్లు వేస్తామని చెప్పారు. ఇది విన్న అభ్యర్థులు మొదట ఖంగుతిన్నా ఆ తర్వాత ఎనిమిది మంది ఎగ్జామ్ రాసేందుకు ముందుకొచ్చారు. కానీ ఒక క్యాండిడేట్ మాత్రం నిరాకరించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మిగిలిన ఎనిమిది మంది రాత్రి 8 గంటల వరకు ఎగ్జామ్ రాశారు.

సర్పంచ్ అభ్యర్థులకు నిర్వహించిన ఈ ఎంట్రెన్స్ టెస్ట్లో గ్రామస్థులు 7 ప్రశ్నలు ఇచ్చారు. మీరు ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారు.? సర్పంచ్ పదవి చేపట్టిన తర్వాత మీ ఐదు లక్ష్యాలు ఏమిటి? సామాజిక సేవలో ఎలా పాలుపంచుకుంటారు? గ్రామ పంచాయతీ పరిథిలోని వార్డులు, గ్రామాలకు సంబంధించిన వివరాలు? మీరు గెలిస్తే ఐదేళ్లలో చేసే అభివృద్ధి పనులేంటి? ఇంటింటికీ వచ్చి ఓట్లు అడిగినట్లే ఎన్నికల తర్వాత కూడా వచ్చి యోగక్షేమాలు కనుక్కుంటారా? తదితర ప్రశ్నలు ఇచ్చారు. ఎన్నిక తేదీకి ఒకరోజు ముందు ఫిబ్రవరి 17న ఎక్కువ మార్కులొచ్చిన అభ్యర్థి పేరు ప్రకటించనున్నారు.

మరిన్ని వార్తల కోసం..

రాష్ట్రపతి పర్యటన: ముచ్చింతల్ లో భారీ బందోబస్తు

వైభవంగా అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణం