వైభవంగా అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణం

వైభవంగా అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణం

ఏపీలోని అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. అశేష భక్త జనం మధ్య సాంప్రదాయ బద్ధంగా కల్యాణం నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత నరసింహుడిని ముత్యాల పల్లకిలో కల్యాణ వేదికకు తీసుకొచ్చారు. కల్యాణ ఘట్టంలోని అన్ని క్రతువులను సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. స్వామి, అమ్మవార్లకు తిరుమల తిరుపతి దేవస్థానం, అన్నవరం, శృంగేరి శారదా పీఠం నుంచి పట్టు వస్త్రాలు సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ పట్టు వస్త్రాలు సమర్పించారు.

మరిన్ని వార్తల కోసం:

కేసీఆర్.. నిరుద్యోగులు నిన్ను తరమకుండా చూస్కో

భారీ ధరకు అమ్ముడుపోయిన భారత స్టార్ బ్యాట్స్మన్

హిజాబ్ వివాదంపై స్పందించిన విదేశాంగ శాఖ