రూ. 30 లక్షల కొత్త కారును రిజర్వేషన్ల కోసం తగలబెట్టాడు

రూ. 30 లక్షల కొత్త కారును రిజర్వేషన్ల కోసం తగలబెట్టాడు

మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్ల కోసం ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే.. జల్నా జిల్లాలో శనివారం నిరసన కారులపై లాఠీఛార్జ్​ చేశారు. పోలీసులు. అయితే లాఠీ ఛార్జ్​కు నిరసనగా స్థానిక సర్పంచ్​ నాటకీయంగా కొత్త కారును తగలబెట్టి నిరసన తెలిపారు. 

జల్నా జిల్లాలోని అంతర్వాలి ప్రాంతంలో మరాఠా రిజర్వేషన్లు డిమాండ్​ చేస్తూ శుక్రవారం జరిగిన నిరసనలు హింసకు దారి తీసింది. నిరసన కారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్​ చేశారు. లాఠీ ఛార్జ్​ ను నిరసిస్తూ స్థానిక సర్పంచ్​ ఒకరు తన కారును తగలబెట్టాడు. అయితే ప్రజలకోసం తన సొంత కారును తగులబెట్టాలనే నిర్ణయాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు.ఔరంగాబాద్​ జిల్లాలో పూలంబ్రీలో స్థానిక సర్పంచ్.. తన సొంత కారును తగుల బెట్టడం ద్వారా  ప్రభుత్వంపై తన వ్యతిరేకతను వ్యక్తం చేశారు. 

అసలు ఏం జరిగింది?

జాల్నా సమీపంలోని అంతర్వాలి ప్రాంతంలో మరాఠా రిజర్వేషన్లు డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష చేపట్టారు.. నిరసన కారులను చెదరగొట్టేందుకు శుక్రవారం పోలీసులు లాఠీ చార్జ్​ చేశారు. శాంతి యుతంగా ప్రదర్శన ఉన్నప్పటికీ లాఠీ ఛార్జ్​ చేశారని నిరసనకారులు తెలిపారు. కాదు.. శాంతిభద్రతలను కాపాడేందుకే లాఠీ ఛార్జ్​ చేశామంటున్నరు పోలీసులు. దీనికి సంబంధించిన వీడియో ఫుటేజ్​ బయటకు రావడంతో రాజకీయ వివాదానికి తెరలేపింది.ఈ అశాంతి శనివారం కొనసాగింది. నిరసనకారులు శుక్రవారం లాఠీ-ఛార్జ్‌తో ఇప్పటికీ ఆందోళన చెందారు. రాళ్లు రువ్వడం, రహదారి దిగ్బంధనం, షట్‌డౌన్‌లకు పిలుపునిచ్చారు.

సర్పంచ్ తన సొంత కారును తగులబెట్టి నిరసన 

ఫులంబ్రి తాలూకాలోని గెవ్రాయ్ పాగా సర్పంచ్ మంగేష్ సబలే.. నిరసనకారులపై లాఠీచార్జికి వ్యతిరేకంగా తన సొంత కారుకు నిప్పు పెట్టి నిరసన ఉధృతిని తెలియజేశారు. ఏడాది క్రితం కొన్న కొత్త కారును తగలబెట్టాడు.  దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఫ్లాట్ ఫారమ్ లో వైరల్ గా మారింది.  ఈ చర్యను సంగ్రహించే వీడియో వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో త్వరగా వైరల్‌గా మారింది. మరోవైపు ఫూలంబ్రీలోని మహాత్మా పూలే చౌక్ దగ్గర మరాఠా క్రాంతి మోర్చా మద్దతుదారులు నిరసనకు దిగారు. 

మరాఠా రిజర్వేషన్ల అంశం మహారాష్ట్రలో ఏండ్ల తరబడి కొనసాగుతున్న వివాదం..రాష్ట్రవ్యాప్తంగా శాంతి యుతంగా నిరసనలు సాగుతున్నా.. జల్నాలోని అంతర్వాలిలో నిరసన కారులపై పోలీసులు లాఠీఛార్జ్ తర్వాత మరాఠాలు ఆగ్రహించడంతో మరోసారి సమస్య తీవ్రతరం అయింది.