- రిజర్వేషన్ వివరాలను వెల్లడించిన అడిషనల్ కలెక్టర్, ఆర్డీవో
గద్వాల, వెలుగు: సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లను ఆదివారం ఆఫీసర్లు ఖరారు చేశారు. జోగులాంబ గద్వాల జిల్లాలో 13 మండలాలకు సంబంధించి 255 గ్రామ పంచాయతీలకు, 2,390 వార్డులకు రిజర్వేషన్లను ఖరారు చేశారు.
ఆదివారం ఆర్డీఓ ఆఫీస్ లో జిల్లా అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు, ఆర్డీఓ అలివేలు, డీపీఓ నాగేంద్రం ఆధ్వర్యంలో సర్పంచ్ స్థానాలకు లక్కీ డిప్ ద్వారా ఖరారు చేశారు. గ్రామాల సర్పంచ్ రిజర్వేషన్లను ఆర్డిఓ, వార్డుల రిజర్వేషన్లను ఎంపీడీవోల ఆధ్వర్యంలో రిజర్వేషన్లు ఖరారు చేసి ఆదివారం సాయంత్రం విడుదల చేశారు.
మొత్తం 255 గ్రామ పంచాయతీలలో ఎస్సీ మహిళలకు 21, ఎస్సీ జనరల్ 30, బీసీ మహిళ 22 బీసీ జనరల్ 38, ఓపెన్ క్యాటగిరి అండ్ రిజర్వుడు లో మహిళలకు 62, జనరల్ కు 67, ఎస్టి మహిళా ఒకటి, ఎస్టీ జనరల్ 4 సర్పంచ్ స్థానాలను రిజర్వేషన్ లో ఖరారు చేశారు.అలాగే నాగర్ కర్నూల్లో జనరల్ 181, ఎస్టీ 133, ఎస్సీ 85 కేటాయించగా.. బీసీలకు 61 స్థానాలు వచ్చాయి.
