టీచర్ల మధ్య పంచాయితీ.. స్కూలుకు తాళం వేసిన సర్పంచ్

టీచర్ల మధ్య పంచాయితీ.. స్కూలుకు తాళం వేసిన సర్పంచ్

శాయంపేట, వెలుగు : టీచర్లు తరచూ పంచాయితీలు పెట్టుకోవడం, టైం కు స్కూల్ కు రాకపోవడంతో విసుగు చెందిన ఓ సర్పంచ్ స్కూల్ కు తాళం వేశాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా శాయంపేట మండలం పెద్దకోడెపాకలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే... పెద్దకోడెపాక గ్రామంలోని బాయ్స్, గర్ల్స్ ప్రైమరీ స్కూల్స్ గతంలో వేర్వేరుగా ఉండగా 2016లో రెండింటినీ బాయ్స్ స్కూల్ కి మార్చారు. అప్పటి నుంచి బాయ్స్ స్కూల్ ఇన్ చార్జి హెచ్ఎం అంబాల చంద్రకళ, గర్ల్స్ స్కూల్స్ హెచ్ఎం మంద శశికళ మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. వీరిద్దరూ టైంకు రాకపోగా ఒకరిపై ఒకరు కంప్లైంట్స్ చేసుకోవడంతో గతంలో ఎంఈవో రమాదేవి, ఎంపీడీవో కృష్ణమూర్తి, ఎంపీపీ తిరుపతిరెడ్డి సమక్షంలో పంచాయితీ జరిగింది. అయినా ఇద్దరి మధ్య సయోధ్య కుదరలేదు. 

సోమవారం నుంచి బాలికల హెచ్ఎం శశికళ స్టూడెంట్లను పాత స్కూల్ ప్రాంగణంలోకి తీసుకెళ్లి విద్యాబోధన చేశారు. విషయం తెలుసుకున్న సర్పంచ్ అబ్బు ప్రకాశ్ రెడ్డి స్కూల్ కు వెళ్లి ఎంఈవో, ఎస్ఎంసీ చైర్మన్ పర్మిషన్ లేకుండా స్టూడెంట్లను పాత స్కూల్ లోకి ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నించారు. బుధవారం స్కూల్​కాంప్లెక్స్​హెచ్ఎం వద్ద అటెండెన్స్​వేసుకుని స్కూల్ కు రావాలని సూచించారు. బుధవారం ఉదయం కూడా టీచర్లు ప్రేయర్​ టైంకి రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సర్పంచ్ స్కూల్ కు తాళం వేసి స్టూడెంట్లను హైస్కూల్ కు పంపించారు. ఇక్కడ పనిచేస్తున్న టీచర్లను మరో చోటికి ట్రాన్స్ ఫర్ చేయాలని డీఈవో, అధికారులను కోరారు.