కామారెడ్డిలో సత్యసాయిబాబా జయంతి వేడుకలు

కామారెడ్డిలో సత్యసాయిబాబా జయంతి  వేడుకలు

కామారెడ్డిటౌన్, వెలుగు : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సత్యసాయిబాబా మందిరంలో  ఆదివారం సత్యసాయిబాబా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అడిషనల్​ కలెక్టర్​ మదన్మోహన్​ బాబా ఫొటోకు పూలమాలలు వేశారు.  భక్తులు ప్రత్యేక భజనలు, సేవా కార్యక్రమాలు చేపట్టారు.  యూత్ వెల్ఫేర్ అధికారి వెంకటేశ్వర్​గౌడ్,  సేవా సమితి కన్వీనర్  లింబాద్రి, భాస్కర్​శర్మ తదితరులు పాల్గొన్నారు.   

ఆధ్యాత్మికతను అలవరచుకోవాలి

ధర్పల్లి , వెలుగు : ఆధ్యాత్మికతను అలవరచుకుంటే మనిషి ఎంతో సంతోషంగా ఉంటారని సత్యసాయి ట్రస్టు సభ్యులు అన్నారు. ఆదివారం సత్యసాయి సేవ సమితి ఆధ్వర్యంలో మండల కేంద్రంలో శత జయంతి ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాస రచన పోటీలు, సాంసృతిక కార్యక్రమాలు నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో సత్యసాయి భక్తులు  పాల్గొన్నారు.