సత్యదేవ్ హీరోగా దర్శకుడు వెంకటేశ్ మహా రూపొందిస్తున్న చిత్రం "రావు బహదూర్'. మహేష్ బాబుకు సంబంధించిన GMB ఎంటర్ టైన్ మెంట్స్ సమర్పణలో చింతా గోపాలకృష్ణ రెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర కలిసి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ టీజర్. మొదటి పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. శుక్రవారం ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. జులై 3న వరల్డ్ వైడ్ గా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.
వాస్తవానికి జూన్ 5న రిలీజ్ అని అనౌన్స్ చేయగా, ఆ టైమ్ లోనే పెద్ది వస్తుండటంతో తమ సినిమాను నెలరోజులు వాయిదా వేసుకున్నట్టు తెలుస్తోంది. దీపా థామస్ హీరోయిన్ గా పటిస్తున్న ఈచిత్రంలో వికాస్ ముప్పాల, బాల పరోపర్, ఆనంద్ భారతి , ప్రణయ్ వాక, మాస్టర్ కిరణ్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కథ, దర్శకత్వం, ఎడిటింగ్ అన్ని బాధ్యతలను స్వయంగా తీసుకున్న వెంకటేశ్ మహా తనదైన పెన్సిబిలిటీస్తో పాటు యూనివర్సట్ ఎమోషన్స్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు నిర్మాతలు తెలియజేశారు.
