ఆర్థిక నేరాలపై జీబ్రా

ఆర్థిక నేరాలపై జీబ్రా

సత్యదేవ్, కన్నడ హీరో డాలీ ధనుంజయ లీడ్ రోల్స్‌‌లో ఈశ్వర్ కార్తీక్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘జీబ్రా’. లక్‌‌ ఫేవర్స్‌‌ ది బ్రేవ్‌‌ అనేది ట్యాగ్ లైన్. ప్రియా భవాని శంకర్, జెన్నిఫర్ పిచినాటో హీరోయిన్స్. ఇప్పటికే ఎనభై శాతం వరకూ షూటింగ్ పూర్తయింది. శుక్రవారం నుండి పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభించారు.

‘రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా, గతంలో ఎన్నడూ చూడని ఆర్థిక నేరాల నేపథ్యంలో క్రైమ్ యాక్షన్ ఎంటర్‌‌టైనర్‌‌‌‌గా రూపొందిస్తున్నాం. ‘కేజీఎఫ్’ ఫేమ్ రవి బస్రూర్‌‌ మ్యూజిక్ హైలైట్ అవుతుంది. త్వరలోనే ఫస్ట్ లుక్‌‌ని విడుదల చేస్తాం’ అని దర్శకనిర్మాతలు తెలియజేశారు. సత్యరాజ్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో సత్య, సునీల్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్.ఎన్ రెడ్డి, బాల సుందరం, దినేష్ సుందరం కలిసి నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ,  మలయాళ, హిందీ భాషల్లో సినిమా విడుదల కానుంది.