
- రూ.800 నుంచి రూ.1000కి పెంచిన ఆఫీసర్లు
- శుక్రవారం నుంచే అమల్లోకి వచ్చిన రేటు పెంపు
యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సత్యనారాయణ వ్రత టికెట్ రేటు పెంపు శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చింది. టికెట్ ధరను రూ. 800 నుంచి రూ. 1000కి పెంచుతూ గతంలోనే నిర్ణయించగా... శ్రావణమాస ప్రారంభం సందర్భంగా శుక్రవారం నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. పెంచిన టికెట్‌పై పూజా సామగ్రితో పాటు కల్యాణషెల్లా, కనుము, లక్ష్మీనరసింహస్వామి, సత్యనారాయణస్వామి విగ్రహాన్ని అందజేయనున్నారు.
శుక్రవారం ముందుగా ఆలయ చైర్మన్ నరసింహమూర్తి, ఈవో వెంకట్‌రావు రూ.1000 చెల్లించి వ్రతపూజలు నిర్వహించారు. మరో వైపు శివాలయం ఎదురుగా ఉన్న ప్రసాద విక్రయ టికెట్ కేంద్రాన్ని కొండపైన ప్రధానాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. అలాగే రింగ్‌రోడ్డుపై గల ఐదు సర్కిళ్లకు ఆంజనేయ, గరుడ, ప్రహ్లాద, రామానుజ, యాదరుషి పేర్లు ఖరారు చేసిన ఆఫీసర్లు.. వాటికి సంబంధించిన బోర్డులను శుక్రవారం ఏర్పాటు చేశారు.