ఓరియంట్ సిమెంట్ కంపెనీ ఎన్నికల్లో సత్యపాల్రావు గెలుపు ...ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు ..విక్రమ్రావుపై 33 ఓట్లు మెజార్టీ

 ఓరియంట్ సిమెంట్ కంపెనీ ఎన్నికల్లో సత్యపాల్రావు గెలుపు ...ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు ..విక్రమ్రావుపై 33 ఓట్లు మెజార్టీ
  •  విక్రమ్​రావుపై 33 ఓట్లు మెజార్టీ
  • భారీ పోలీసు బందోబస్తు నడుమ ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు

కాసిపేట, వెలుగు: మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని ఓరియంట్​సిమెంట్​కంపెనీ(అదానీ)లో శుక్రవారం జరిగిన గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో ఓరియంట్​సిమెంట్​పర్మనెంట్​వర్కర్స్​ఫెడరేషన్​(తరాజు గుర్తు) తరఫున పోటీ చేసిన కొక్కిరాల సత్యపాల్​రావు గెలుపొందారు. తన సమీప ప్రత్యర్థి పుస్కురి విక్రమ్​రావుపై విజయం సాధించారు. 

సత్యపాల్​రావుకు 141 ఓట్లు రాగా విక్రమ్​రావుకు 108 ఓట్లు పడ్డాయి. మరో అభ్యర్థి తట్ర భీంరావుకు కేవలం ఆరు ఓట్టే పడ్డాయి. దీంతో కె. సత్యపాల్​రావు 33 ఓట్ల మెజార్టీతో గెలుపొందినట్టు అధికారులు ప్రకటించా రు.  శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్​జరిగింది. కంపెనీలో మొత్తం 266 ఓట్లు ఉండగా.. ఇందులో 265 మందే  ఓటు వేశారు. ఒక కార్మికుడు వేయలేదు. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.  

 ఇది కార్మికుల విజయం : సత్యపాల్​రావు

గెలుపు అనంతరం కె. సత్యపాల్​రావు విజయోత్సవ ర్యాలీ తీశారు. అందులో ఆయన మాట్లాడుతూ.. తన గెలుపు కార్మికులదేనని పేర్కొన్నారు. కార్మికుల హక్కులను కాపాడుతూ, సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు.  ఆదివాసీ నేతలు, కార్మికుల కృషితోనే విజయం సాధించినట్లు పేర్కొన్నారు.