షకీల్‌‌‌‌ డబుల్​ సెంచరీ ... పాక్​కు భారీ ఆధిక్యం

షకీల్‌‌‌‌ డబుల్​ సెంచరీ ...    పాక్​కు భారీ ఆధిక్యం

గాలె: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్‌‌‌‌లో పాకిస్తాన్‌‌‌‌ భారీ ఆధిక్యం సాధించింది. సౌద్‌‌‌‌ షకీల్‌‌‌‌ (208 నాటౌట్‌‌‌‌) డబుల్‌‌‌‌ సెంచరీతో చెలరేగడంతో.. 225/5 ఓవర్‌‌‌‌నైట్‌‌‌‌ స్కోరుతో మంగళవారం మూడో రోజు ఆట కొనసాగించిన పాక్‌‌‌‌ తొలి ఇన్నింగ్స్‌‌‌‌లో 121.2 ఓవర్లలో 461 రన్స్‌‌‌‌ చేసింది. అగా సల్మాన్‌‌‌‌ (83)  కూడా రాణించాడు. రమేశ్‌‌‌‌ మెండిస్‌‌‌‌ 5, ప్రబాత్‌‌‌‌ జయసూర్య 3 వికెట్లు తీశారు. తర్వాత బ్యాటింగ్‌‌‌‌కు దిగిన లంక ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌‌‌‌లో 3.4 ఓవర్లలో 14 రన్స్‌‌‌‌ చేసింది. నిశాన్‌‌‌‌ మధుష్క (8 బ్యాటింగ్‌‌‌‌), దిముత్‌‌‌‌ కరుణరత్నె (6 బ్యాటింగ్‌‌‌‌) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం లంక ఇంకా 135 రన్స్‌‌‌‌ వెనకబడి ఉంది.