
న్యూఢిల్లీ: దేశ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పెద్దదైన ఎస్‌బీఐ క్యాష్ విత్‌డ్రా విషయంలో కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఇకపై ప్రతినెలా ఎస్‌బీఐ ఏటీఎం, హోమ్ బ్రాంచ్‌ల నుంచి నాలుగుసార్లు మాత్రమే డబ్బులను విత్‌డ్రా చేసుకోవాలి. ఈ ఫ్రీ లిమిట్ దాటిన తర్వాత డబ్బులు విత్‌డ్రా చేసుకున్న ప్రతిసారి రూ.15తోపాటు జీఎస్టీ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని ఎస్‌బీఐ పేర్కొంది. ఎస్‌బీఐ హోమ్ బ్రాంచ్‌తోపాటు ఏటీఎంలు, నాన్ ఎస్‌బీఐ ఏటీఎంలకు ఈ ఛార్జెస్ వర్తిస్తాయని స్పష్టం చేసింది. వచ్చే నెల నుంచి ఈ రూల్స్ అమల్లోకి వస్తాయని తెలిపింది. ఎస్‌బీఐ ఖాతాదారులు ఒక ఆర్థిక సంవత్సరంలో 10 చెక్‌లను మాత్రమే వాడుకోవచ్చు. ఆ తర్వాత 10 చెక్‌లకు రూ.40తోపాటు జీఎస్టీని చెల్లించాలి. అదే 25 చెక్‌లకు అయితే రూ.75తోపాటు జీఎస్టీ కట్టాలి. ఎమర్జెన్సీగా చెక్ బుక్ కావాలనుకుంటే జీఎస్టీతోపాటు యాభై రూపాయలు చెల్లించాలి.