హైదరాబాద్, వెలుగు: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), ఈ ఏడాది సెప్టెంబర్ 30తో ముగిసిన రెండవ క్వార్టర్లో 10 శాతం వృద్ధితో రూ. 20,160 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే క్వార్టర్లో ఈ లాభం రూ. 18,331 కోట్లుగా ఉంది. బ్యాంకు మొత్తం ఆదాయం గత ఆర్థిక సంవత్సరం రెండవ క్వార్టర్లో రూ. 1,29,141 కోట్ల నుంచి పెరిగి రూ. 1,34,979 కోట్లకు చేరింది.
వడ్డీ ఆదాయం రూ. 1,13,871 కోట్ల నుంచి పెరిగి రూ. 1,19,654 కోట్లకు చేరుకుంది. గ్రాస్ఎన్పీఏలు గత ఏడాది 2.13 శాతం నుంచి తగ్గి 1.73 శాతానికి చేరాయి. నెట్ ఎన్పీఏలు కూడా 0.53 శాతం నుంచి తగ్గి 0.42 శాతానికి పడ్డాయి. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన బ్యాంకు లాభం 7 శాతం పెరిగి రూ. 21,137 కోట్లుగా నమోదైంది.
