ఉత్త అన్నం ఎట్ల తింటరు..? వార్డెన్లపై కమిషనర్ సీరియస్

 ఉత్త అన్నం ఎట్ల తింటరు..? వార్డెన్లపై కమిషనర్ సీరియస్

యాదాద్రి, వెలుగు : హాస్టల్​వార్డెన్లపై స్టేట్ ఎస్సీ డెవలప్​మెంట్ కమిషనర్ క్షితిజ సీరియస్​ అయ్యారు. కూరలు సరిపోను వండకుంటే పిల్లలు ఉత్త అన్నం ఎట్ల తింటరని ప్రశ్నించారు. మరోసారి ఇలా జరిగితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భువనగిరిలోని ఎస్సీ బాలికలు, బాలుర హాస్టల్స్​ను డిప్యూటీ డైరెక్టర్​రమాదేవితో కలిసి గురువారం రాత్రి ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంట సరుకులు సహా పిల్లల కోసం చేసిన వంటలను పరిశీలించారు.

 అన్నం ఉన్నప్పటికీ కూరలు సరిపోను లేకపోవడంతో వార్డెన్లపై సీరియస్​ అయ్యారు. అనంతరం పిల్లలతో ముచ్చటించారు. ఈ సందర్భంగా తమకు ఇంగ్లిష్​-తెలుగు డిక్షనరీలు, కథల బుక్స్​ కావాలని పిల్లలు కోరగా, వారంలో పంపిస్తామని క్షితిజ తెలిపారు. ఆమె వెంట ఎస్సీ డెవలప్​మెంట్ ఆఫీసర్​శ్యాంసుందర్​ఉన్నారు.