కొండగట్టు టెండర్లలో గోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మాల్

కొండగట్టు టెండర్లలో గోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మాల్

కొడిమ్యాల, వెలుగు : కొండగట్టు టెండర్లలో కాంట్రాక్టర్లు కుమ్మక్కై ఆలయ ఆదాయానికి గండి కొడుతున్నారు. కొండగట్టులో కొద్దిరోజులుగా నిల్వ చేసిన తలనీలాలకు అధికారులు గురువారం వేలం నిర్వహించారు. టెండర్లలో పాల్గొన్న వ్యాపారులు కుమ్మక్కై వ్యక్తిగతంగా వేయాల్సి సీల్డు టెండర్లు ఉండగా అందరి టెండర్లు ఒక్కరే  బాక్స్ లో వేశారు.

అధికారుల సమక్షంలోనే ఈ తతంగం జరుగుతున్నా అడ్డుచెప్పకపోవడం అనుమానాలకు తావిస్తోంది. గతంలో తలనీలాలు కిలోకు రూ.15వేలు పాడగా తాజాగా రూ.7,600కు మాత్రమే పాడారు. కాగా అధికారులు టెండర్​ఖరారు చేయకుండా కమిషనర్ నిర్ణయానికి పంపించారు. 

ఆర్జిత సేవలు రద్దు

సమ్మక్క-సారక్క జాతర  సమీపిస్తున్నందున కొండగట్టులో అంజన్న సన్నిధికి భక్తుల తాకిడి పెరిగింది. దీంతో ఈనెల 21 వరకు ఆలయంలో పలురకాల ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈవో వెంకటేశ్ గురువారం తెలిపారు.